షేర్ మార్కెట్ కొంప ముంచింది. ఓ ఇంటి యజమానికి షేర్ మార్కె్ట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. అప్పుల బాధ భరించలేక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య ( 60), శ్రీదేవి (50) దంపతులకు ఇద్దరు సంతానం. మొండయ్య అప్పులు చేసిన మరీ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు.. చేసిన అప్పులు చెల్లించలేక నిన్న (మంగళవారం) కుటుంబం మొత్తం కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగింది.
READ MORE: Funky : మాస్ కా దాస్ విశ్వక్ కొత్త సినిమా టైటిల్ ఏంటంటే ?
ఇంట్లో నుంచి పెద్దగా అరుపులు వినిపించడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు.. మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మొండయ్య, భార్య శ్రీదేవి, కూతురు చిట్టి మృతి చెందారు. మరో వైపు కుమారుడు శివప్రసాద్( 26 ) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
READ MORE: Mohan Babu: మోహన్‌బాబు ఆరోగ్యంపై కీలక ప్రకటన.. ఇప్పుడు ఎలా ఉందంటే?