Sukhvinder Sukhu: సీఎంను చుట్టుముట్టిన “కోడి కూర” వివాదం.. అసలేం జరిగింది? (వీడియో)
- మరో వివాదంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం
- విందులో వైల్డ్ చికెన్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు వివాదాలకు మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘సర్కార్ గావ్ కే ద్వార్’ కింద సిమ్లా జిల్లా చౌపాల్ సబ్-డివిజన్‌లోని కుప్వి తహసీల్‌లోని టిక్కర్ గ్రామంలో ఆయన బస చేశారు. విందులో ముఖ్యమంత్రితో పాటు ఇతర అతిథులకు స్థానిక వంటకాలను వడ్డించారు. ఈ మోనూలో “వైల్డ్ చికెన్” కూడా ఉంది. సీఎం ఆ కూర తినలేదు. అయినప్పటికీ.. ఈ రకం కోడి కూరను మెనూలో చేర్చడాన్ని తప్పుపడుతూ జంతు సంరక్షణ సంస్థ ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో సీఎం సుఖు వివాదాల్లోకి చేరారు.
READ MORE; Kakinada Crime: వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన.. చంపేందుకు మహిళ బంధువులు ప్లాన్!
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కాగా.. 1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతుల జాబితాలో ‘వైల్డ్ చికెన్’ కూడా చేర్చారు. వాటిని వేటాడటం నిషేధం. ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రతిపక్షాలు సీఎంను తప్పుపడుతున్నాయి. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జైరాం ఠాకూర్ తన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. “ఆనారోగ్య కారణాల వల్ల నేను నూనె, నాన్-వెజ్ వంటకాలకు దూరంగా ఉంటున్నాను. కానీ ప్రతిపక్ష నాయకులు ఈ వీడియో వైరల్ చేస్తూ.. గ్రామస్థుల పరువు తీసే విధంగా చేస్తున్నారు. గ్రామస్థుల ప్రతిష్టను దిగజార్చే పని చేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో నివసించే వారికి నాన్ వెజ్ ఫుడ్ వారి జీవితంలో భాగం. ఈ మాత్రం అర్థం చేసుకోకుంటే ఎలా.. వాస్తవానికి అక్కడున్న స్థానికులు నాకు ఆ ఆహారాన్ని అందించారు. కానీ నేను దానిని తినలేదు. అయితే కొన్ని మీడియా ఛానెళ్లు మాత్రం నేను ఆ చికెన్ తిన్నానంటూ ప్రసారం చేస్తున్నాయి.” అని తెలిపారు.
जनता के घर द्वार जाकर लोगों की समस्याओं के निराकरण करने की हमारी योजना ‘जनमंच’ के फुलके जिन्हे खल रहे थे वह आज गाँव गाँव जा कर पिकनिक मना रहे हैं और क्या कर रहे है जनता सब देख रही है 🧐
संरक्षित प्रजाति के जंगली मुर्गा खाने वालों को जेल होती है, जुर्माना होता है लेकिन… pic.twitter.com/NjtN0iDjXN
— Jairam Thakur (@jairamthakurbjp) December 14, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!