ట్రక్కును నడపాలంటే ఎంతో ఏకాగ్రత అవసరం. ఏ మాత్రం అజాగ్రత్త వహించిన భారీ మూల్యం తప్పదు. అయితే.. లారీ నడిపేటప్పుడు స్టీరింగ్‌పై రెండు చేతులు ఉంచి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కాళ్లు బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్‌ను నియంత్రిస్తాయి. వీటితో పాటు చేతితో గేర్లు వేస్తాం. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కేవలం తన పాదాలతో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ.. వాహనాన్ని నడపడం కనిపిస్తుంది. సుమారు 10 సెకన్ల క్లిప్‌లో డ్రైవర్ వెనుక సీటుపై పడుకుని ఈ ఫీట్ చేస్తున్నాడు. ఈ వీడియో రోడ్డు భద్రతకు సంబంధించి వినియోగదారుల మధ్య చర్చకు దారితీసింది. ట్రక్‌లో పడుకుని స్టీరింగ్‌ని కంట్రోల్ చేస్తున్న వ్యక్తిని చూసి అందరూ షాక్ అవ్వడమే కాకుండా తన ప్రాణాల కోసం కాకపోయినా ఇతరుల ప్రాణాలను కాపాడాలని సూచిస్తున్నారు.
READ MORE: Ministers Tummala: అలా చేయడం వల్లనే మున్నేరు వరద ముంపు గండం..
ఈ వీడియో తమిళనాడుకి చెందినది. TN 52 M 1635 నంబర్ గల ఈ ట్రక్ తమిళనాడులోని సేలం జిల్లాలో రిజిస్టర్ అయినట్లు చూపిస్తుంది. ఈ ట్రక్కుపై ‘శ్రీ సాయి సప్తగిరి’ అనే బోర్డు కూడా అమర్చబడి ఉంది. ఓ ఎక్స్ వినియోగదారుడు ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైనదిని అభివర్ణించాడు. వేల మంది ఈ వీడియోను చూశారు. లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు భారీ రిస్క్ తీసుకుంటున్నారని రాసుకొచ్చారు. ఈ వీడియోను తమిళనాడు పోలీసులు, రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాగ్ చేసి.. ఈ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Sai Kiran : ‘నువ్వే కావాలి’ అంటూ నటిని పెళ్లాడనున్న సీరియల్ నటుడు
☠️☠️ pic.twitter.com/r69KmrIcUp
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 4, 2024