ఈరోజుల్లో నగలు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. దొంగతనాలు, దోపిడీ ఘటనలు ఎక్కువవయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. అయితే దుబాయ్‌లో ఓ మహిళ ఆభరణాల భద్రతకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌కి చెందిన ఓ యువతి బహిరంగ ప్రదేశాల్లో ఆభరణాల భద్రతకు సంబంధించి ఆశ్చర్యకరమైన ప్రయోగం చేసింది. ఆమె తన నెక్లెస్, ఉంగరాలను తీసి తన కారు బానెట్ మీద ఉంచి అక్కడ నుంచి కొంచెం దూరంలో నిలబడింది. ఈ ఆభరణాలను ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నిస్తారా? అని తెలుసుకోవడానికే ఇదంతా చేసింది.
READ MORE: Sukumar : దట్ ఈజ్ సుకుమార్.. ఆయన గొప్పతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది !
మహిళ నగలను 30 నిమిషాల పాటు అక్కడే ఉంచింది. ఈ సమయంలో చాలా మంది అటుగా వెళ్లినప్పటికీ ఎవరూ ఆభరణాలను తాకడానికి లేదా దొంగిలించడానికి ప్రయత్నించలేదు. చివరకు ఆ మహిళ వెళ్లి తన నగలను వెనక్కి తీసుకుంది. ఈ ఘటనపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె.. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఆభరణాలు భద్రంగా ఉండే దేశం దుబాయ్ అని చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ ఘటనపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దుబాయ్ భద్రతా వ్యవస్థ, ప్రజలను ప్రశంసించారు. “దుబాయ్‌లో దొంగతనం చేయడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ కఠినమైన శిక్షలు ఉన్నాయి.” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కాగా.. దుబాయ్‌లోని కఠినమైన న్యాయ వ్యవస్థ, కఠినమైన శిక్షా విధానాల కారణంగా దొంగతనాలు చాలా తక్కువ. ఈ మహిళ చేసిన ఈ ప్రయోగం దుబాయ్ భద్రతను ప్రపంచానికి చూపించడమే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద చర్చను సృష్టించింది.