తనపై కుట్ర జరుగుతోందని పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అన్నారు. ఇందులో పోలీసులు కూడా భాగస్వాములయ్యారని ఆరోపించారు. తనతో పాటు తన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను ఇరికిస్తున్నారన్నారు. నేను జైలులో ఉన్నాను. ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని ఎలా బెదిరిస్తాను? అని పేర్కొన్నారు. జైలు నుంచి హత్య ఎలా చేస్తాం? అని తెలిపారు. శనివారం జోధ్‌పూర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో లారెన్స్ బిష్ణోయ్ తన వివరణ ఇచ్చారు. జోధ్‌పూర్‌లోని జైన్ ట్రావెల్స్ యజమానిని బెదిరించి చంపడానికి ప్రయత్నించిన కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ న్యాయమూర్తి ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
READ MORE: Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన.. షెడ్యూల్ వివరాలు..
లారెన్స్ బిష్ణోయ్ మేజిస్ట్రేట్ ముందు.. “నేను జైలులో ఉన్నాను. నేను ఒకరిని ఎలా బెదిరించగలను? నేను ఒకరిని ఎలా చంపగలను? ఇదంతా నాపై జరుగుతున్న కుట్ర. ఈ కుట్రలో నా సోదరుడు అన్మోల్ ని కూడా ఇరికించారు. జైల్లో మొబైల్ ఫోన్లు లేవు. అలాంటప్పుడు నేను ఎవరితోనైనా మొబైల్‌లో ఎలా మాట్లాడగలను? నాపేరు కొందరు వాడుకుంటున్నారు. ఈ కుట్రలో పోలీసులు కూడా పూర్తిగా భాగస్వాములయ్యారు.” అని చెప్పాడు.
READ MORE: Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి!
కాగా.. 2022లో సిద్ధూ మూసేవాలా హత్య కేసులో భటిండా జైలులోనే పంజాబ్ పోలీసులు లారెన్స్‌ను అరెస్టు చేశారు. లారెన్స్ ‘ఏ కేటగిరీ’ గ్యాంగ్‌స్టర్ అని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని ఈ కేటగిరీలో చేరుస్తారు. సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన కొద్ది రోజులకే సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. అది కూడా లారెన్స్ పనేనన్న ఆరోపణలున్నాయి. కాగా..2022లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లారెన్స్ పేరును చేర్చింది. కచ్‌లోని పాకిస్తానీ ఓడ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న కేసు ఇది.
READ MORE: Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి!
ఆ సరకును ఆర్డర్ చేయడంలో లారెన్స్ హస్తం ఉందన్నది పోలీసులు అనుమానం. గుజరాత్ పోలీసులు 23 ఆగస్టు 2023న లారెన్స్‌ను దిల్లీ జైలు నుంచి గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన సబర్మతి జైలులోనే ఉన్నారు. ఆగస్టు 30, 2023న లారెన్స్ బిష్ణోయీపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీఆర్‌పీసీ సెక్షన్ 268 (1)ని విధించింది. ఏడాది పాటు సబర్మతి జైలు నుంచి ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణకు ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరుస్తున్నారు. లారెన్స్ బిష్ణోయీ హత్య, దోపిడీ, దాడి వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పంజాబ్, దిల్లీ, రాజస్థాన్‌లలో ఆయనపై పదులసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నాలుగు కేసుల్లో లారెన్స్ దోషిగా తేలారని పోలీసులు చెప్పారు.