ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో 46 ఏళ్ల నాటి దేవాలయం బయట పడింది. ఈ శివాలయాన్ని బయటపడకుండా దాచినట్లు తెలుస్తోంది. ఈ పరమేశ్వరుని ఆలయాన్ని పోలీసులు గుర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి.. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు హింసాకాండ జరిగినప్పటి నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దుండగులపై సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో పలు ఏరియాల్లో తిరిగి తనిఖీ చేసిన ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్.. అక్రమ కరెంట్ కనెక్షన్లను గమనించారు. ఈ విద్యుత్తు చోరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెకింగ్‌కు వెళితే కొందరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు బెదిరిస్తున్నారని విద్యుత్ శాఖ అధికారులు ఎస్పీకి తెలిపారు. అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నట్లు వాపోయారు. దీంతో నేడు పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమ విద్యుత్తు కనెక్షన్లను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ విస్తుపోయే కట్టడాన్ని కనుగొన్నారు.
READ MORE: YSRCP: జగన్ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు.. పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపు
మసీదులు, ఇళ్లలో దొంగ కనెక్షన్లను గుర్తించేందుకు జరిపిన సోదాల్లో ఎత్తున విద్యుత్ చౌర్యం జరిగినట్లు వెల్లడైంది. అయితే.. దీపా రాయ్ ప్రాంతంలో తనిఖీ చేయగా.. అకస్మాత్తుగా ఓ ఇంట్లో ఆలయం బయటపడింది. ఈ గుడిని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఆలయం 1978 సంవత్సరానికి చెందిందని చెబుతున్నారు. ఇందులో హనుమంతుడు, శివలింగం, నంది విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో డీఎం ఎస్పీతో పాటు భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. 46 ఏళ్లుగా మూతపడిన ఈ ఆలయం ఎస్పీ ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కే ఇంటికి 200 మీటర్ల దూరంలో కనిపించింది.
READ MORE:Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
ఈ విషయమై అడిషనల్ ఎస్పీ శ్రీశ్‌చంద్ర మాట్లాడుతూ.. “కొంతమంది ఇళ్లు కట్టుకుని ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తనిఖీల్లో తేలింది. ఆలయాన్ని శుభ్రం చేశాం. ఆలయాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఆలయంలో శివుడు, హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి. ఒకప్పుడు హిందూ కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసించేవారు. కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ముస్లిం జనాభా మధ్యలో మూసి ఉన్న ఆలయానికి సమీపంలో పురాతన బావి ఉన్నట్లు కూడా సమాచారం అందింది. బావి తవ్వుతున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణలను కూడా కూల్చివేస్తాం.
A Shiva temple in Sambhal, closed for 46 years has been reopened by Yogi Adityanath's administration 🔥 शिव मंदिर
हिंदुओं अपने सही वोट की ताक़त देखों और योगी जी के सही निर्णय की तारीफ कर दिया करो
अपने धर्म के लिए योगी जी के साथ खड़े रहना
एक है तो सेफ़ है। हर हर महादेव pic.twitter.com/av0MacBdG7— pardeep jakhar (@jakharpardeep) December 14, 2024