ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఆతిథ్య భారత్.. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ మాత్రమే టోర్నీలో అజేయంగా నిలిచాయి. ఈ జట్లు నాలుగింట నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఈ వరల్డ్ కప్ లో ఈ జట్ల విజయ పరంపర కొనసాగుతుండడంతో భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం అని స్పష్టమవుతోంది.
ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియా తర్వాతి మ్యాచ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కివీస్ జట్టు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు సంబంధించి న్యూజిలాండ్ టీమ్ స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో టీమిండియాను ముందుగా ఆపాల్సి ఉంటుందని చెప్పాడు.
AP Athletes Meets CM YS Jagan who Won Medals in Asian Games 2023: ఏషియన్ గేమ్స్ 2023లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. కోనేరు హంపి, బి అనూష, యర్రాజీ నేడు జ్యోతిలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం అభినందించారు. తాము సాధించిన పతకాలను సీఎం జగన్‌కు క్రీడాకారులు చూపించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు…
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై క్రూరమైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 1400 మంది చనిపోయారు. మరోవైపు ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై హమాస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 4000 మంది ప్రజలు చనిపోయారు.
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు క్రికెట్ స్టేడియానికి వచ్చారు. అందులో భాగంగానే భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా వచ్చి క్రికెట్ ను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే.. తన ఫ్రెండ్స్ తో మంచి మూడ్ లో ఉన్న సారా.. శుభ్ మాన్ గిల్ క్యాచ్ పట్టగానే సారా…
పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు లిటన్ దాస్, తంజీద్ హాసన్ శుభారంభం అందించారు. వీరిద్దరు అర్థసెంచరీలు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు చెతులెత్తేశారు.
పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఇండియాను ఫీల్డింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతికి వికెట్ కీపర్ ఈ అద్భుత క్యాచ్ పట్టాడు. సిరాజ్ 24వ ఓవర్ తొలి బంతిని క్రాస్ సీమ్ నుండి లెగ్ సైడ్ వైపు వేశాడు. దానిని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్…
ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్.. మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లను సులువుగా ఓడించింది. అయితే జట్టు గెలుపుకు కావాల్సింది కేవలం బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. ఫీల్డింగ్ కూడా ముఖ్యం. అయితే ఆడిన మూడు మ్యాచ్ ల్లో టీమిండియా ఫీల్డర్లు క్యాచ్ లు పట్టడంలో అగ్రస్థానంలో ఉన్నారు. 93 శాతం క్యాచ్‌లను భారత ఫీల్డర్లు సద్వినియోగం చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత నెదర్లాండ్స్ రెండో…