సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేసిన ఏసీబీ కోర్టు విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అధికారులపై రూ.300 కోట్లకు పైగా టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు…
కోల్‌కతా పర్యటన ముగించుకుని లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు స్టార్ట్ అయ్యారు. కాగా, సాల్ట్‌లేక్ స్టేడియంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మెస్సీ.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి పుష్కరాలు–2027 తేదీలు ఖరారు గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పుష్కరాల నిర్వహణపై కమిషనర్ సమర్పించిన నివేదికకు ప్రభుత్వం…
* నేడు భారత్ పర్యటనకు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ.. GOAT టూర్లో భాగంగా 3 రోజులు ఇండియాలో మెస్సీ.. 14 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న మెస్సీ.. హైదరాబాద్ సహా కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో పర్యటన * హైదరాబాద్: నేడు ఉప్పల్ స్టేడియంలో ఫ్లెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్.. రాత్రి 7 గంటలకు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ – సీఎం రేవంత్ జట్ల మధ్య మ్యాచ్.. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి రాహుల్ గాంధీ *…
విశాఖ గురించి వైఎస్ జగన్ చెప్పిందే.. చంద్రబాబు చెబుతున్నారు.. అన్నివైపులా విశాఖ అభివృద్ధిపై చర్చ సాగుతున్న వేళ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ అప్పుడు విశాఖ గురించి చెప్పిన విషయాలనే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని తొలి సారిగా వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు విశాఖ ప్రాధాన్యతను ఎందుకు గుర్తించలేదని…
ప్రపంచకప్ విజేతలు.. మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్ కల్యాణ్ సన్మానం.. ప్రపంచ కప్ విజేతలుగా భారత్‌కు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును సన్మానించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న ఈ మహిళా క్రీడాకారిణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున చెక్కులు, కోచ్‌లకు రూ.2…
Toyota Mirai: టయోటా కిర్లోస్కర్ మోటార్ తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ ‘మిరాయ్’ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పజేప్పింది. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇదెలా వర్క్ చేస్తుందనే విషయాన్ని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ జీరో ఎమిషన్ వెహికిల్స్ లో టయోటా మిరాయ్ ఒకటి. ఈ కారు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మధ్య జరిగిన రసాయన చర్యతో ఏర్పడిన…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ప్రవేశపెట్టారు. ఈ కార్డు ద్వారా పౌరసత్వం లభించనుంది. 1 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డు పొంద వచ్చని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.