Haryana Shocker: లవర్‌కు రంగులు రాశాడని, ఫ్రెండ్ దారుణహత్య..
- హర్యానాలో దారుణం..
- లవర్‌కు రంగులు రాశాడని, స్నేహితుడి దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana Shocker: తన ప్రేయసికి రంగులు పూశాడనే కారణంగా ఒక వ్యక్తి 23 ఏళ్ల యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానాలోజరిగింది. హత్యను రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు యువకుడి మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారని పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలోని పానిపట్‌లో ఈ ఘటన జరిగింది.
హోలీ పండగ రోజున కాలు అనే వ్యక్తి అదృశ్యమ్యాడు. ఆ తర్వాత అతడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై దొరికింది. మొదట్లో దీనిని రైలు ప్రమాదంగా అంతా భావించారు. అయితే, , ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) జరిపిన దర్యాప్తులో ఇది ముందుగానే పథకం ప్రకారం చేసిన అత్యంత కిరాతకమైన హత్య అని తేలింది. ఈ కేసులో మహమూద్‌పూర్‌కు చెందిన సంజు, రాహుల్, విశాల్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
Read Also: Pak-Afghan war: 400 మంది మృతి.. పాకిస్తాన్‌పై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. హోలీ రంగుల వివాదం, గతంలో ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగా హత్య జరిగినట్లు తెలిసింది. విచారణలో ముగ్గురు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కుట్ర వెనక ప్రధాన సూత్రధారి సంజు అని పోలీసులు గుర్తించారు. హోలీ రోజున సంజు ప్రేయసికి కాలు రంగులు పూయడంతో గొడవ ప్రారంభమైంది. దీని తర్వాత హత్యకు సంజు ప్లాన్ చేసినట్లు తేలింది. ఘటన రోజున కాలును సంజు బయటకు రావాలని కోరాడు. ముగ్గురు నిందితులతో కలిసి కాలు మద్యం సేవించాడు. కాలుతో ఎక్కువ మందు తాగించారు.
కాలు మద్యం మత్తులో ఉన్నప్పుడు ,అతడిని బైక్‌పై రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే సంజు స్క్రూడ్రైవర్‌తో అతని మెడపై రెండుసార్లు దాడి చేశాడు. అయినప్పటికీ, ఈ దాడి జరిగినప్పటికీ కాలు మరణించలేదు. ఆ తర్వాత కాలు కాళ్లు చేతులు కట్టేసి, రైల్వే ట్రాక్‌పై పడుకోబెట్టారు. మద్యం మత్తు, గాయాల వల్ల కాలు కదలలేకపోయాడు. నిందితులు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే వేగంగా వస్తున్న రైలు అతడిని ఢీకొట్టింది. సాంకేతిక ఆధారాలు, మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!