భారత్లో జరిగిన ప్రపంచకప్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును తిరగరాశాడు. ఈ క్రమంలో ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరువలో ఉన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో బ్యాటింగ్ జాబితాలో టాప్ 5లో భారత్ కు చెందిన ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు.
ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌లో సెంచరీ.. ఫైనల్‌లో హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి నం. 3 స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కోహ్లీ రేటింగ్ పాయింట్లు పొంది టాప్ 2 బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ల దగ్గరిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. టాప్ 4 స్థానానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎగబాకాడు. కాగా.. 826 రేటింగ్ పాయింట్లతో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా, బాబర్ ఆజం 824 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్ ముగిసే సమయానికి కోహ్లీ 791 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 769 రేటింగ్ పాయింట్లతో నాలుగోస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. అంతకుముందు కోహ్లి 2017, 2021 మధ్య దాదాపు నాలుగు సంవత్సరాల పాటు నెం.1 ర్యాంకింగ్‌లో కొనసాగాడు.
Tamil Nadu: గొడ్డు మాంసం తిన్న విద్యార్థిని వేధించి, దాడి చేసిన ఉపాధ్యాయులు..
టాప్ 5 ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్
1. శుభమాన్ గిల్ – 826 రేటింగ్ పాయింట్లు
2. బాబర్ ఆజం – 824 రేటింగ్ పాయింట్లు
3. విరాట్ కోహ్లీ – 791 రేటింగ్ పాయింట్లు
4. రోహిత్ శర్మ – 769 రేటింగ్ పాయింట్లు
5. క్వింటన్ డి కాక్ – 760 రేటింగ్ పాయింట్లు
ఇక.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ టాప్ 10లో తమ స్థానాలను నిలుపుకున్నారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 741 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ 699 పాయింట్లతో 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మహ్మద్ షమీ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి వచ్చాడు.