Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్ర చేసిందని అమెరికా అధికారి ఆరోపించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నిన్న కథనాన్ని ప్రచురించింది. అయితే అమెరికా ఈ హత్య ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు తన కథనంలో పేర్కొంది. అయితే పన్నూను హత్య చేసే కుట్రలో ప్రమేయం ఉందని తెలియగానే భారత్ ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్‌హౌజ్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ అన్నారు. అయితే వాట్సన్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ.. ఇలాంటి వైఖరి తన విధానం కానది భారత్ పేర్కొంది.
‘‘భారత ప్రభుత్వం ఈ సమస్యను మరింతగా పరిశీలిస్తోందని మేము అర్థం చేసుకున్నాము. రాబోయే రోజుల్లో దీని గురించి మరన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. బాధ్యులుగా భావించే ఎవరైనా జవాబుదారీగా ఉండాలనే మా అంచనాను మేము తెలియజేశాము’’ అని వాట్సన్ చెప్పారు. అమెరికా ప్రభుత్వం ఈ విషయాన్ని భారత ప్రభుత్వంతో సీనియర్ మోస్ట్ స్థాయిలో లేవనెత్తిందని, దీనిని ‘అత్యంత సీరియస్’గా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read Also: Jammu Kashmir Encounter: 24 గంటలుగా ఎన్‌కౌంటర్.. పాక్ కీలక ఉగ్రవాది హతం..
వ్యవస్థీకఈత నేరస్తులు, ఉగ్రవాదుల, వారి మధ్య లింకులకు సంబంధించిన భద్రతా విషయాలపై ఇటీవల జరిగిన చర్యల్లో అమెరికా నుంచి కొన్ని విషయాలు అందినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. దేశం యొక్క జాతీయ భద్రతా ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి భారతదేశం ఇటువంటి ఇన్‌పుట్‌లను తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన అన్నారు
యూకే-కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్న గురుపత్వంత్ సింగ్ నిజ్జర్ ఖలిస్తాన్‌కి మద్దతుగా, భారత వ్యతిరేకత కలిగి ఉన్నారు. ఇతనికి పాకిస్తాన్, ఐఎస్ఐతో లింకులు కూడా ఉన్నాయి. ఇతడిని భారత్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థను ఉగ్రసంస్థగా గుర్తించింది. ఇటీవల కెనడాలో హత్యకు గురైన హర్దీప్ సింగ్ నిజ్జర్ వెనక కూడా భారత ఏజెంట్లు ఉన్నట్లు కెనడా ప్రధాని ఆరోపిస్తున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాలకు ప్రమాదం ఉన్నట్లు బెదిరించాడు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్లను కూడా బెదిరిస్తూ వీడియోలను విడుదల చేశాడు.