Sanju Samson: విజయాల కంటే పరాజయాలే ఎక్కువ, మానసికంగా కుంగిపోయా.. సంజు భావోద్వేగ వ్యాఖ్యలు!
- వరల్డ్ కప్ నా చిన్ననాటి కల
- ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డా
- విజయాల కంటే పరాజయాలే ఎక్కువ
- సంజు శాంసన్ భావోద్వేగ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Opens Up on Failures: టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తన కెరీర్, లక్ష్యాల గురించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించడం తన చిన్ననాటి కల అని, దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కృషి చేశానని తెలిపాడు. వరల్డ్ కప్ లక్ష్యాన్ని సాధించాలనే కోరిక తన మనసులో ఎప్పుడూ ఉండేదని, దాన్ని ప్రతిరోజూ ఊహించుకుంటూ ధ్యానం చేసేవాడినని వెల్లడించాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, వైఫల్యాలు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. కెరీర్‌లో విజయాల కంటే పరాజయాలే ఎక్కువ అని, ఓ సమయంలో మానసికంగా కుంగిపోయా అని సంజు చెప్పుకొచ్చాడు.
తాజాగా సంజు శాంసన్ మాట్లాడుతూ… ‘2019లో ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చా. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ నాతో మాట్లాడాడు. జట్టులోకి వచ్చాక నీ లక్ష్యం ఏంటి? అని అడిగాడు. నేను ఎలాంటి సందేహం లేకుండా భారత్‌కు వరల్డ్ కప్ అందించడమే నా టార్గెట్ అని చెప్పా. అప్పటి నుంచి 2026 వరకూ అదే లక్ష్యంతో కృషి చేశా. నా ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, వైఫల్యాలు ఎదురయ్యాయి. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు కిందికి పడిపోయా. విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా చూశా. అందుకే వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అదే నా బలం’అని వివరించాడు.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
‘వరల్డ్ కప్ 2026 ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విఫలమయ్యా. ఆ సమయంలో నేను మానసికంగా కుంగిపోయా. కానీ నాలుగు ఐదు రోజుల్లోనే తిరిగి లేచి నిలబడగలిగా. నాలో ఉన్న పట్టుదలే మళ్లీ విజయాల దిశగా నడిపించింది. చివరకు భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించాలనే కల నెరవేరింది. నా జీవితంలో చివరి శ్వాస వరకు ఇది గుర్తుంటుంది’ అని సంజు శాంసన్ భావోద్వేగంగా వెల్లడించాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన 5 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా సంజు నిలిచాడు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!