IND vs AUS: విశాఖలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ను ముందుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ శతకం సాధించాడు. కేవంల 50 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ లో గెలిచి మంచి జోరు మీదున్న ఆస్ట్రేలియా జట్టు.. టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకుంది.
Read Also: Andhra Pradesh: ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసిన హిందీ టీచర్
ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ఓపెనర్ గా వచ్చిన స్టీవ్ స్మిత్ 41 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. మాథ్యూ షార్ట్ 13, స్టోయినీస్ 7, టిమ్ డేవిడ్ 19 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణకు తలో వికెట్ దక్కింది. ఈ క్రమంలో 209 పరుగుల భారీ లక్షచేధనకు బరిలోకి దిగిన టీమిండియా.. 2 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (21), రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ రూపంలో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1) ఉన్నారు.
Read Also: D.K Shivakumar: తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ పర్యటన..