America: మనలో చాలా మంది బ్రతుకు దెరువుకు ఒక చోట నుండి మరో చోటుకి వలస వెళ్తుంటాం. అలా స్వదేశం లో పొరుగు రాష్ట్రాలకు, ప్రాంతాలకు వెళ్లి అక్కడ పొట్ట కూటి కోసం పలురకాల పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారిని మనం చూస్తుంటాం. అయితే కొందరు ఇతర దేశాలకు కూడా వలస వెళ్తుంటారు. అక్కడ ఎన్నో కష్టాలు పడి కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంటారు. అయితే స్వదేశంలో ఎక్కడికైనా వెళ్లి జీవించ వచ్చు. కానీ విదేశాలకు వెళ్ళాలి అంటే ఆ దేశం నుండి అనుమతిని పొందాల్సి ఉంటుంది. అయితే కొందరు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా విదేశాలకు వెళ్లి జీవిస్తుంటారు.
Read also:Bigg Boss7 Telugu : బిగ్ బ్రేకింగ్.. హౌస్ లో అమర్ దీప్ కు అశ్వస్థత.. ట్రీట్మెంట్ కోసమే..
ఇలా అనుమతి లేకుండా దేశం లోకి ప్రవేశించే అక్రమ వలసదారులు బెడద అగ్రరాజ్యం అమెరికాకు కూడ ఉంది. తాజాగా ప్యూ పరిశోధన కేంద్రం అక్రమ వలసదారుల గురించి పరిశీలనలు చేసింది. ఈ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో 2007-2021 మధ్యకాలంలో 1.05 కోట్ల మంది విదేశీయులు అమెరికా లోకి అక్రమంగా ప్రవేశించారని వెల్లడించింది. కాగా వారిలో 41 లక్షల మంది మెక్సికన్లు కాగా..మరో 8 లక్షల మంది ఎల్‌సాల్వడార్ నుంచి వచ్చారని పేర్కొన్నది. అలానే 2021 నాటికి 7.25 లక్షల మంది భారతీయులు అమెరికా లోకి అక్రమంగా ప్రవేశించారని పేర్కొంది. ఈ గణాంకాల ప్రకారం అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన వారిలో మొదటి స్థానంలో మెక్సికో ఉండగా.. రెండో స్థానంలో ఎల్‌సాల్వడార్ నిలవగా.. మూడో స్థానంలో భారత్ ఉండడం గమనార్హం.