IND vs AUS T20: ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా.. ఈ సిరీస్‌లో టీమిండియాలో చాలా మంది యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.
Uttarkashi tunnel collapse: సొరంగం వద్దకు పల్లకిలో “దేవతామూర్తులు”.. చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్..
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్
మాథ్యూ వేడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, నాథన్ ఎల్లిస్, సీన్ ఆంథోనీ అబాట్, స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెండార్ఫ్, మార్కస్ స్టోయినిస్, తన్వీర్ సంఘా