విశాఖ వేదికగా రేపు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. వైజాగ్ లోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. గురువారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రేపటి మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Read Also: Bandi Sanjay: కేటీఆర్, కేసీఆర్‌లపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
ఈ సిరీస్‌లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ గా మాథ్యూ వేడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో.. ప్రపంచ కప్ 2023లో భాగమైన కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. అందులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ ప్రపంచకప్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఆడలేదు. కాగా.. సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల్లో శ్రేయాస్ అయ్యర్ జట్టులో చేరనున్నాడు.
విశాఖపట్నంలోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్‌లకు పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పిచ్ పేసర్లు, స్పిన్నర్లకు మంచిగా అనుకూలిస్తుంది. ఈ పిచ్ లో సెకండ్ ఛేజింగ్ బ్యాటింగ్ 67 శాతం మ్యాచ్‌లను గెలుచుకుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా జట్టులో 15 మంది సభ్యులు ప్రపంచ కప్‌లో ఆడినవారు ఉన్నారు. ఈ క్రమంలో భారత్.. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది కావున ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read Also: Viral video: రోస్టేట్ బ్రెడ్ ను ఎక్కువగా తింటున్నారా? ఈ వీడియో చూస్తే జన్మలో ఇక తినరు..
టీమిండియా ప్లేయింగ్ లెవన్ అంచనా:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ/అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవన్ అంచనా:
స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా.