2023 వన్డే ప్రపంచకప్‌లో మూడింటిలో మూడు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియా.. రేపు బంగ్లాదేశ్ తో తలపడనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్స్ లేవని మాంబ్రే స్పష్టం చేశాడు.
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓటమి నుంచి పాకిస్థానీలు ఇంకా తేరుకోవడం లేదు. మరోవైపు రేపు పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లకు పాకిస్తాన్ కు చెందిన నటి సెహర్ షిన్వారీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్‌పై…
ఈ వరల్డ్ కప్ లోనైనా పాకిస్తాన్ గెలవాలనే కసితో దిగినప్పటికీ.. 8వ సారి ఇండియా చేతిలో ఓటమిపాలైంది. మరోసారి పాకిస్థాన్‌పై టీమిండియా అద్భుతం చేసి చూపించిందని గంభీర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియా-పాక్ ఈ టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు.
క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్‌లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనుంది. వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది.
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన సన్నాహాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మిషన్ సన్నద్ధతను అంచనా వేయడానికి ఈ సమావేశం నిర్వహించబడింది.
అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్ కీలక దశకు చేరుకోనుంది. గగన్‌యాన్ మిషన్ కింద అక్టోబర్ 21న టెస్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం ప్రకటించింది.
Ricky Ponting Says India Extremely Hard To Beat for Any Team: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 విజేతగా టీమిండియా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతుండటం భారత్‌కు కలిసొస్తోందని, బలమైన జట్టుతో బరిలోకి దిగడం కూడా సానుకూలాంశంగా పేర్కొన్నాడు. భారత్‌ను ఓడించడమంటే ఇతర జట్లకు చాలా కష్టమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ 2023లో రోహిత్…
Verdict to be out on Same Gender Marriage form Supreme Court: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైందని కాదని స్పష్టం చేసింది. లైంగిక ధోరణి ఆధారంగా…
All eyes on Supreme Court verdict on Same Gender Marriage: నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించనుంది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఏం…
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో తమ జట్టును అన్ని రకాలుగా చిత్తు చేసిందని తెలిపాడు. పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిందని కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా.. టీమిండియా ముందు పాకిస్తాన్ జట్టు ఓ చిన్న పిల్లల జట్టులా కనిపించిందని విమర్శలు చేశాడు.