Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్’.. షాకైన కస్టమర్లు!
- కర్ణాటకలో గ్యాస్ సిలిండర్ల కొరత
- నిమ్మకాయ జ్యూస్‌కి గ్యాస్ ఛార్జ్
- గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ పేరిట 5 శాతం అదనంగా వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Cafe Charges Gas Fee for Lemon Juice: కర్ణాటకలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఒక హోటల్ యాజమాన్యం వినియోగదారులకు అదనపు భారాన్ని మోపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని ఓ కేఫ్‌లో నిమ్మకాయ జ్యూస్ తాగిన కస్టమర్లు బిల్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఉండాల్సిన బిల్లుకు అదనంగా ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరిట 5 శాతం అదనంగా వసూలు చేయడం వివాదానికి దారి తీసింది.
ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వినియోగదారులు రెండు గ్లాసుల నిమ్మరసం ఆర్డర్ చేశారు. వాటి మొత్తం ధర రూ.358 కాగా.. అదనంగా గ్యాస్ సంక్షోభ ఛార్జ్ పేరుతో రూ.17.01 వసూలు చేశారు. నిమ్మరసం వంటి సాధారణ పానీయానికి గ్యాస్ ఛార్జ్ ఎలా వేస్తారని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు కూడా హోటల్ చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఉద్యోగస్తులకు జాక్‌పాట్!
ఈ ఘటనపై రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల హక్కుల కమిషన్ స్పందించింది. హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే విధంగా ఇలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం సరైంది కాదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసే విధానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటనతో హోటళ్లలో అదనపు ఛార్జీలపై మరింత చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!