Israel-Hamas War: గాజా సంధిలో భారత్ సాయం కోరనున్న ఇస్లామిక్ దేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కోసం ఇస్లామిక్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. అక్టోబర్ 7నాటి దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. 23 లక్షల జనాభా ఉన్న అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంపై దాడులు చేయడం వల్ల అక్కడ 13 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అయితే వీరిలో 5 వేల మంది వరకు చిన్నారులు ఉండటంపై అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సంధి కోసం భారత్ సాయం కోరేందుకు పవర్ ఫుల్ ఇస్లామిక్ దేశాల ప్రతినిధి బృందం మన దేశాన్ని సందర్శించనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, పాలస్తీనా, ఇండోనేషియా విదేశాంగ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందంతో పాటు ఐఓసీ జనరల్ సెక్రటరీ గాజాపై చర్చించడానికి భారతదేశాన్ని సందర్శించనున్నట్లు తెలిసింది. గాజా సంక్షోభంపై చొరవ తీసుకునేందుకు రియాద్‌లో ఏర్పాటు చేసిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం భారత్‌తో పాటు P5 దేశాలను సందర్శించనున్నారు.
Also Read
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
Read Also: Tesla: భారతీయులకు అందుబాటు ధరలోనే టెస్లా కారు.. ధర ఎంతంటే..?
అయితే ఇప్పటి వరకు వారి తేదీలు ఖరారు కాలేదు. ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, పాలస్తీనా, ఇండోనేషియా విదేశాంగ మంత్రులు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) ప్రధాన కార్యదర్శి ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్యదేశాలైన యూఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలను పీ5 దేశాలుగా పిలుస్తారు. కాల్పుల విరమణ, గాజాపై శతృత్వానని వీడేలా ఇజ్రాయిల్‌ని ఒప్పించాలనీ పీ5 దేశాలతో పాటు ఇండియాను కోరనున్నారు.
ఇటీవల సౌదీ రాజధాని రియాద్‌లో ఇస్లామిక్ దేశాలు నవంబర్ 11న భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలని ఇరాన్ సభ్యదేశాలను కోరింది. ప్రతినిధి బృందం చైనాలో పర్యటించి, ఈ యుద్ధాన్ని నిలపుదల చేయాలని కోరింది. ఈ పర్యటన తర్వాత రష్యాలో పర్యటించిన బృందం, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమైంది. పౌరుల రక్షణ, మానవతా కారిడార్లు, బందీల విడుదలపై చర్చించారు.
తాజావార్తలు
-
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
-
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!