Renault Duster 2026: రెనాల్ట్ డస్టర్ లాంచింగ్ ఈ రోజే.. ఫీచర్లు, డెలివరీ వివరాలు ఇవే..
- 2026 రెనో డస్టర్ ఈ రోజే లాంచింగ్..
- టెక్ ఫీచర్లు, అదిరిపోయే డిజైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renault Duster 2026: రెనాల్ట్ డస్టర్(Renault Duster) ఈరోజు (మార్చి17)న భారతదేశంలో లాంచ్ కాబోతోంది. దేశంలో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారు.. ప్రస్తుతం లేటెస్ట్ లుక్, టెక్ లోడెడ్ ఫీచర్లతో మళ్లీ ఎంట్రీ ఇస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత సరికొత్త డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో ఈ SUV మళ్లీ వస్తోంది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి విక్టోరిస్, హోండా ఎలివేట్‌కు పోటీ ఇస్తుంది.
ధర, బుకింగ్స్:
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
అధికారికంగా ఈ కారు ధరల్ని రెనో ఈ రోజు ప్రకటించనుంది. మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ధర సుమారుగా రూ. 10 లక్షల(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కావచ్చు. బుకింగ్ టోకెన్ అమౌంట్ రూ. 21,000గా కంపెనీ నిర్ధారించింది. టర్బో పెట్రోల్ మోడల్ డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని, హైబ్రీడ్ వెర్షన్ మోడల్స్ దీపావళి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదిరిపోయే డిజైన్:
కొత్తగా వస్తున్న డస్టర్ డిజైన్ పరంగా మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. కొత్తగా LED DRLs (eyebrow style), పెద్ద గ్రిల్, సిల్వర్ బంపర్, పిక్సెల్ స్టైల్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. మొత్తంగా రగ్గడ్, మోడర్న్ లుక్ ఉంది.
ఇంటీరియర్స్, సేఫ్టీ అండ్ ఫీచర్లు:
డ్యుయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, 10.1 ఇంచ్ ఇన్ఫొటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో-కార్ ప్లే, 7-ఇంచ్ డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆంబియంట్ లైటింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి. 2026 రెనాల్ట్ డస్టర్‌లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్, ఆటోమెటిక్ అడ్జెస్ట్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, 60:40 నిష్పత్తిలో విడిపోయే వెనుక సీట్లు, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. ఈ సేఫ్టీ సూట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ,లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) సామర్థ్యాలు ఉన్నాయి.
ఇంజన్ ఆప్షన్లు:
మూడు ఇంజన్ ఆప్షన్లతో 2026 డస్టర్ వస్తుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 bhp పవర్, 160 Nm టార్క్ (6-స్పీడ్ మాన్యువల్) కలిగి ఉంటుంది. 1.3L టర్బో పెట్రోల్- 160 bhp పవర్, 280 Nm టార్క్ (మాన్యువల్ మరియు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్), 1.8L హైబ్రిడ్ (E-Tech)- 160 bhp పవర్ ఇస్తుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఇంజన్‌ను కలిగి ఉంటుంది. హ్రైబ్రీడ్ వెర్షన్ మెరుగైన మైలెజ్ క్లెయిమ్ చేస్తుంది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!