Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్యకు భారత్ ప్లాన్.. భగ్నం చేసిన అమెరికా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఓ అధికారి చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ బుధవారం నివేదించింది. పన్నూను హత్య చేసేందుకు న్యూఢిల్లీ ప్లాన్ చేసిందని, భారతదేశం ప్రయేయంపై అమెరికా హెచ్చరిక జారీ చేసిందని కూడా వార్తా పత్రిక నివేదించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పన్నూను అమెరికా గడ్డపైనే హతమార్చేందుకు కుట్ర చేసినట్లు వార్తాపత్రిక నివేదించింది.
ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్టు చేస్తున్న పన్నూని భారతదేశం ఉగ్రవాదిగా గుర్తించింది. యూస్‌లో ఖలిస్తాన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. అతను నిర్వహిస్తున్న ‘సిఖ్ ఫర్ జస్టిస్’ సంస్థను కూడా భారత్ ఉగ్రసంస్థగా ప్రకటించింది. అయితే ఈ కుట్ర గురించి యూఎస్ అధికారులు హెచ్చరించారా..? లేదా..? అనే విషయాన్ని చెప్పడానికి పన్నూ నిరాకరించినట్లు సదరు పత్రిక చెప్పింది. భారత్ నుంచి అమెరికన్ గడ్డపై నా ప్రాణాలకు ముప్పు ఉన్న విషయంపై యూఎస్ ప్రభుత్వం ప్రతిస్పందించనివ్వండి అని పన్నూ చెప్పాడని నివేదించింది.
Also Read
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
Read Also: GVL Narasimha Rao: కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారు.. సీపీఐ, సీపీఎంలు పిట్ట పార్టీలు
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో భారత్ వ్యతిరేకి, కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా ఉంటున్న గురుపత్వంత్ సింగ్ పన్నూను ఆ దేశంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన కెనడా, ఇండియా దేశాల మధ్య దౌత్యవివాదంగా మారింది. ఈ ఘటనలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన కొన్ని వారాల తర్వాత, పన్నూ హత్యకు భారత్ ప్లాన్ చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా కథనాన్ని ప్రచురించింది. అయితే గతంలో ట్రూడో చేసిన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది కెనడా అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది.
పన్నూ గత కొంత కాలంగా అమెరికా, కెనడా, బ్రిటన్ వ్యాప్తంగా ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఇతనికి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా, జై శంకర్, అజిత్ దోవల్ వంటి వారికి ప్రాణాపాయ బెదిరింపులు చేశాడు. ఇతనికి, ఇతని సన్నిహితులకు చెందిన ఆస్తుల్ని ఇటీవల ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇటీవల నవంబర్ 19న ఎయిరిండియా విమానాలకు ప్రమాదం ఉందని బెదిరించాడు.
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!