Harish Rao: హ్యామ్ రోడ్ల పేరిట భారీ కుంభకోణం.. ఆనాడు వద్దన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం!
- మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సంచలన ఆరోపణలు
- హ్యామ్ రోడ్ల పేరిట భారీ కుంభకోణం జరుగుతోంది
- హ్యామ్ రోడ్ల పేరుతో రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. అసెంబ్లీలో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. హ్యామ్ (HAM) రోడ్ల పేరిట సుమారు రూ.18 వేల కోట్ల స్కాం జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తే రేవంత్ రెడ్డి వద్దు అని గొడవ పెట్టారని.. ఇప్పుడు 10 శాతం మొబిలైజేషన్ ఇస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
హరీష్ రావు మాట్లాడుతూ… ‘ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోంది. హ్యామ్ రోడ్ల పేరుతో రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్ అండ్ బీ)లో రూ.12 వేల కోట్లు, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో రూ.6 వేల కోట్లు కలిపి భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి వద్దు అని గొడవ పెట్టారు. ఇప్పుడు అదే ప్రభుత్వం 10 శాతం మొబిలైజేషన్ ఇస్తోంది. ఇందులో కమిషన్లు తీసుకుని ఎన్నికల ఖర్చు కోసం పంపబోతున్నారు. ఈ వ్యవహారం పెద్ద స్థాయి స్కాం గా మారే ప్రమాదం ఉంది’ అని ఆరోపించారు.
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
Also Read: Sanju Samson: విజయాల కంటే పరాజయాలే ఎక్కువ, మానసికంగా కుంగిపోయా.. సంజు భావోద్వేగ వ్యాఖ్యలు!
ఈ టెండర్లకు సీఓటీ (COT) అనుమతి కూడా అవసరం లేకుండా, డిపార్ట్‌మెంట్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 34 టెండర్ ప్యాకేజీలలో ఇప్పటికే 24 టెండర్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కుతో 20 నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు టెండర్లు వేయించారని కూడా ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రజల డబ్బును కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?