IND vs BAN: బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా.. కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండో, చివరి టెస్టు జరగనుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. రెండు జట్ల మధ్య జరిగే…
Ravichandran Ashwin Breaks Nathan Lyon Record: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. ముందుగా బ్యాట్‌తో ఆదుకున్న యాష్.. ఆపై బంతితో తిప్పేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ (113) చేసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ పడగొట్టాడు. దాంతో టెస్ట్‌లో పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం కోట్నీ వాల్ష్‌ను…
Team India Creates History in 92 Years Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు ఓటముల కంటే.. ఎక్కువ విజయాలు సాధించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. అంతేకాదు అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో జట్టుగా టీమిండియా నిలవడం…
India won by 280 Runs Against Bangladesh: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బంగ్లా.. రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంకు 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేన 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (82) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్స్ పడగొట్టగా.. రవీంద్ర…
Jasprit Bumrah Record: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్స్)లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను ఔట్ చేసిన బుమ్రా.. ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా ఏకంగా 47 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు…
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 37.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
Virat Kohli: చెన్నైలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో చాలా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతను బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హాసన్ తో సరదాగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మూడో రోజు లంచ్ సమయానికి చెన్నై టెస్టులో భారత్ 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో…
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33*), రిషబ్ పంత్ (12*) ఉన్నారు. భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 149 పరుగుల వద్ద బంగ్లా ఆలౌట్ అయ్యింది. దీంతో.. భారత్ 227 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి బంగ్లా ఆటగాళ్లను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండేసి వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో అత్యధికంగా షకీబ్ అల్ హసన్ (32), మెహిదీ హాసన్ మిరాజ్ (27), లిటన్ దాస్ (22) పరుగులు చేశారు.
IND vs BAN Test: భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. శుక్రవారం ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత జట్టు శుక్రవారం ఒక్క గంట ఆటకే పరిమితమైంది. రెండో రోజు రెండో ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా వికెట్‌ను తస్కిన్ అహ్మద్ తీయగా 86 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర…