IND vs BAN: 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. భారత్‌కు ప్రత్యేకంగా చెన్నై టెస్ట్!
- బంగ్లాదేశ్‌పై ఘన విజయం
- భారత్ జట్టు ఖాతాలో అరుదైన ఘనత
- క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Creates History in 92 Years Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు ఓటముల కంటే.. ఎక్కువ విజయాలు సాధించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. అంతేకాదు అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో జట్టుగా టీమిండియా నిలవడం విశేషం.
భారత జట్టు 1932లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ను కలుపుకొని ఇప్పటివరకు 580 టెస్టులు ఆడింది. ఇందులో 179 విజయాలు ఉండగా.. 178 ఓటములు ఉన్నాయి. 222 మ్యాచ్‌లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయింది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో పరాజయాల కంటే గెలుపులే అధికం కావడం ఇదే ప్రథమం. దాంతో చెన్నై టెస్ట్ మ్యాచ్ టీమిండియాకు ప్రత్యేకంగా నిలిచింది. ఫాన్స్ భారత జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.
Also Read
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
Also Read: IND vs BAN: ఆరేసిన అశ్విన్.. బంగ్లాపై భారత్ ఘన విజయం! పాకిస్తాన్‌లా కాదు
92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు 36 మంది సారథులుగా వ్యవహరించారు. భారత జట్టుకు మొదటి టెస్ట్ కెప్టెన్ సీకే నాయుడు కాగా.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రతిఒక్కరూ జట్టుని ముందుండి నడిపించి ఎన్నో విజయాలను, మరెన్నో జ్ఞాపకాలనూ అందించారు. 92 ఏళ్లలో 314 మంది క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 1932 జూన్ 25న అమర్‌సింగ్ మొదటి టెస్ట్ క్యాప్ అందుకోగా.. 2024 మార్చి 7న దేవదత్ పడిక్కల్ చివరిసారిగా టోపీ అందుకున్నాడు. ఇన్నేళ్లలో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండ్యూలర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ, ఆర్ అశ్విన్, విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా లాంటి ఎందరో టెస్టుల్లో తనదైన ముద్ర వేశారు.
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!