Ravichandran Ashwin: దిగ్గజాల రికార్డులు బ్రేక్స్ చేసిన అశ్విన్!
- తొలి టెస్ట్‌లో అదరగొట్టిన అశ్విన్
- మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ
- రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్
- కోట్నీ వాల్ష్ రికార్డు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin Breaks Nathan Lyon Record: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. ముందుగా బ్యాట్‌తో ఆదుకున్న యాష్.. ఆపై బంతితో తిప్పేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ (113) చేసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ పడగొట్టాడు. దాంతో టెస్ట్‌లో పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం కోట్నీ వాల్ష్‌ను యాష్ వెనక్కి నెట్టేశాడు.
ఆర్ అశ్విన్ 522 వికెట్లతో 9వ స్థానంలోకి వచ్చాడు. కోట్నీ వాల్ష్ 519 వికెట్లతో తొమ్మిదో స్థానానికి పరిమితం అయ్యాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (800) అగ్ర స్థానంలో ఉన్నాడు. షేన్ వార్న్ (708), జేమ్స్ అండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), నాథన్ లయన్ (530) మాత్రమే అశ్విన్ కంటే ముందున్నారు. మరో 9 వికెట్లు తీస్తే లయన్‌ను దాటేస్తాడు. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో చెలరేగితే అశ్విన్ పైకి ఎగబాకుతాడు.
Also Read
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
Also Read: IND vs BAN: 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. భారత్‌కు ప్రత్యేకంగా చెన్నై టెస్ట్!
అయితే నాథన్ లయన్ మరో రికార్డును మాత్రం ఆర్ అశ్విన్ బ్రేక్ చేశాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అత్యధిక సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఫీట్‌ను యాష్ మొత్తం 11 సార్లు సాధించాడు. ఈ జాబితాలో నాథన్ లయన్ (10), ప్యాట్ కమిన్స్ (8), జస్ప్రీత్ బుమ్రా (7), జోష్ హజిల్‌వుడ్ (6), టీమ్ సౌథీ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!