బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33*), రిషబ్ పంత్ (12*) ఉన్నారు. భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5) పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (17) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా, టస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
Karnataka: శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. కాగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 227 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం భారత్ మొత్తం ఆధిక్యం 308 పరుగులు ఉంది. ఇంకా.. ఆటకు మూడు రోజుల సమయం ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ (113) సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత.. రవీంద్ర జడేజా (86) పరుగులు చేశాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధశతకంతో రాణించాడు. రిషబ్ పంత్ (39) పరుగులు చేసి భారత్ ఆధిక్యాన్ని పెంచారు. అలాగే.. బౌలర్లలో బుమ్రా చెలరేగాడు. బంగ్లా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. తన అద్భుత బౌలింగ్ తో 4 వికెట్లు పడగొట్టి స్కోరును కట్టడి చేశాడు.