బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 149 పరుగుల వద్ద బంగ్లా ఆలౌట్ అయ్యింది. 47.1 ఓవర్లకే భారత్ ఆలౌట్ చేసింది. దీంతో.. భారత్ 227 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి బంగ్లా ఆటగాళ్లను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండేసి వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో అత్యధికంగా షకీబ్ అల్ హసన్ (32), మెహిదీ హాసన్ మిరాజ్ (27), లిటన్ దాస్ (22) పరుగులు చేశారు.
Read Also: Sri Lanka: రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. పోలింగ్‌కి సర్వం సిద్ధం
శుక్రవారం ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో.. భారత జట్టు మొత్తం 376 పరుగులు చేసింది. ఆ తర్వాత.. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్, ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇస్లాం (2), జాకీర్ హాసన్ (3) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత కెప్టెన్ శాంటో (20) పరుగులు చేసి కాసేపు క్రీజులో నిలబడ్డాడు. మెమినుల్ హక్ డకౌట్ కాగా.. ముష్ఫిఖర్ రహీమ్ (8), హసన్ మమూద్ (9), టస్కిన్ అహ్మద్ (11), నహీద్ రానా (11) పరుగులు చేశారు.
Read Also: Delhi: పోలీసు అరెస్టును తప్పించుకోవడానికి ఫ్లైఓవర్ నుంచి దూకి నేరస్థుడు మృతి..