బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) శుక్రవారం భారత్‌తో సిరీస్ కోసం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. బీసీబీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 28న బంగ్లాదేశ్ చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి, బంగ్లాదేశ్‌లో స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో.. బీసీసీఐ ఈ పర్యటనకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.…
ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా మరికాసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ జాకీర్ అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్‌కు బదులు జకీర్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. భారత్ మ్యాచ్ కోసం బంగ్లా తుది జట్టులో నాలుగు మార్పులు చేసినట్లు చెప్పాడు. మరోవైపు భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. సూపర్ 4లో చిరకాల ప్రత్యర్థి…
ఆసియా కప్ 2025లో భాగంగా ఈరోజు రాత్రి బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరుకుంటుంది. మ్యాచ్ నేపథ్యంలో ప్లేయింగ్ 11పై అందరిలో ఆసక్తి నెలకొంది. పాకిస్థాన్ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేదు. దాంతో బంగ్లా మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతిని ఇస్తుందని అందరూ భావించారు. అయితే ఆసియా కప్ 2025లోని మిగతా మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉంటాడని టీమిండియా సహాయక కోచ్ రైన్ టెన్…
IND vs BAN: పాకిస్తాన్‌పై భారీ విజయాన్ని సాధించిన భారత్.. ఆసియా కప్ 2025 సూపర్ 4లో తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో నేడు (సెప్టెంబర్ 24) తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల పాత్ర కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య జరిగిన 17 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించగలిగింది. గణాంకాల…
ఆసియా కప్ 2025కు ముందు ఆరు నెలల పాటు టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అన్ని సిరీస్‌లకు ఎంపికయినా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో కుల్దీప్ కేవలం రెండే వన్డేలు మాత్రమే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సత్తాచాటినా.. ఇంగ్లండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025లో అవకాశం…
ఆసియా కప్ 2025లో భారత్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్‌లపై అద్భుతమైన విజయాలు సాధించిన భారత్.. సూపర్-4లో కూడా ఆధిపత్యాన్ని చూపుతోంది. సూపర్-4లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మరోసారి జయకేతనం ఎగురవేసింది. సూపర్-4లో భారత్ ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఫైనల్ బెర్త్ దక్కనుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమిండియా కోచ్ గౌతమ్…
వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), బీసీసీఐ సంయక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను తరువాత విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 2026లో నిర్వహించేందుకు బీసీబీ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక హింసాత్మక…
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా గెలుపుతో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి గ్రూప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 228 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్‌లో రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 41 పరుగులు చేసి టీమిండియాకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలిచింది. 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.