IND Playing 11 vs BAN For 2nd Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాను ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదే ఊపులో కాన్పూర్ వేదికగా శుక్రవారం ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తోంది. అంతేకాదు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంతో రెడీ అవుతోంది.…
Ravichandran Ashwin 6 Can Break 6 Records In Kanpur Test: బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. చెన్నైలో జరిగిన మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. మరో కీలక పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. కాన్పూర్ టెస్ట్‌లోనూ గెలిచి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చెన్నైలో చెలరేగిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కాన్పూర్‌లోనూ సత్తాచాటాలని చూస్తున్నాడు.…
Kanpur stadium C Stand in Dangerous: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ స్టేడియంలో శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది. 2021 తర్వాత కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఇదే కావడం విశేషం. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో మ్యాచ్ చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే కాన్పూర్ స్టేడియంలోని పరిస్థితులపై పలువురు…
Jasprit Bumrah Likely To Rested for IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25లో టీమిండియా తన అగ్ర స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 27 నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు మరింత చేరువకావాలని భావిస్తోంది. అయితే ఈ కీలక టెస్ట్…
Kanpur Pitch Report for India vs Bangladesh 2nd Test: సాధారణంగా చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంటుంది. స్పిన్నర్లు చెపాక్‌లో పండగ చేసుకుంటారు. అయితే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో మాత్రం బంతి బాగా బౌన్స్ అయింది. ఎన్నడూ లేనివిధంగా పేసర్లు ప్రమాదకరంగా మారారు. తొలి రెండు రోజులు పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెను సవాలుగా మారింది. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఆలస్యంగా మొదలైంది. చెన్నైలో పేసర్లు అంత జోరు…
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ఆరంభం కానుంది. మొదటి టెస్టులో ఆడని యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు.. రెండో టెస్టులో కూడా చోటు దక్కే అవకాశాలు లేవు. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాతో రెండో టెస్టు జట్టు నుంచి సర్ఫరాజ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇరానీ ట్రోఫీలో అతడిని ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుండి 5 వరకు లక్నోలో…
సిరీస్‌ల మధ్య విరామాలు తీసుకోవాలని, అప్పుడే ఫిట్‌గా ఉండొచ్చని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. నైపుణ్యం కంటే శారీరకంగా ఫిట్‌గా ఉంటూ సీజన్‌ను పూర్తి చేయడమే అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. జట్టులో కొనసాగాలంటే నిరంతరం ప్రాక్టీస్‌లోనే ఉండాల్సిన అవసరం లేదని యాష్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టు విజయంలో కీలక…
2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్.. దాదాపు రేండేళ్ల తర్వాత బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లో పునరాగమనం చేసినా.. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి.. 13 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో (109) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తన బ్యాటింగ్ సందర్భంగా బంగ్లాదేశ్…
Ravichandran Ashwin about Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంటే తనకు అసూయ అని, కానీ అతడిని ఎంతో ఆరాధిస్తాను అని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సహ క్రికెటర్లతో రేసులో ఉన్నప్పుడు వారి కంటే మనమే ముందు ఉండాలని కోరుకోవడం సహజం అని పేర్కొన్నాడు. జడేజాతో తాను ఎప్పటికీ పోటీ పడలేనని తెలిశాక అతడి మీద అభిమానం పెరిందని యాష్ చెప్పాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో…
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్ గురించి తాను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదన్నాడు. వికెట్స్ అవసరమైన ప్రతిసారీ అతడివైపే చూస్తాం అని చెప్పాడు. బంతి లేదా బ్యాట్‌తో జట్టును ఆదుకునేందుకు ఎల్లప్పుడూ యాష్ సిద్ధంగా ఉంటాడని రోహిత్ తెలిపాడు. టీఎన్‌పీఎల్‌లో అశ్విన్ బ్యాటింగ్ చేయడం తాము చాలాసార్లు గమనించాం అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో యాష్ సెంచరీ…