Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’!
- బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు
- 14 మ్యాచ్‌లలో 47 వికెట్లు
- బుమ్రా అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Record: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్ (మూడు ఫార్మాట్స్)లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను ఔట్ చేసిన బుమ్రా.. ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా ఏకంగా 47 వికెట్లు పడగొట్టాడు.
ఇంతకుముందు ఈ రికార్డు హాంకాంగ్ పేసర్ ఎహ్సాన్ ఖాన్ పేరిట ఉంది. ఎహ్సాన్ 27 మ్యాచ్‌ల్లో 46 వికెట్లు తీశాడు. తాజాగా ఎహ్సాన్‌ను జస్ప్రీత్ బుమ్రా అధిగమించాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా (43), ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (41), బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ (36) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో మరో టెస్ట్ ఉన్న నేపథ్యంలో బుమ్రా 50 వికెట్ల మార్కును అందుకోనున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్ అనంతరం భారత్ న్యూజీలాండ్, ఆస్ట్రేలియాతో కూడా మ్యాచులు ఆడనుంది.
Also Read
Also Read: IPL 2025: ఫ్రాంచైజీల డిమాండ్‌కే బీసీసీఐ మొగ్గు.. ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చంటే?
ఇక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చేరుగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లట్స్ తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక వికెట్ తీశాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 36 టెస్టులు, 89 వన్డేలు, 70 టీ20లు ఆడాడు. వరుసగా 159, 149, 89 వికెట్స్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!