భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ ఎవరికీ తలవంచే రకం కాదన్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా చివరి వరకూ పోరాడాలనే బలంగా భావిస్తాడన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా బాగుందని రోహిత్ పేర్కొన్నాడు. మొన్నటివరకు రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు గంభీర్‌తో కలిసి జట్టును నడిపిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా జియో…
IND vs BAN 2nd Test Day 3 Updates: కాన్పూర్ వేదికగా మొదలైన భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మొదటి రోజు ఆటలో 35 ఓవర్లు మాత్రమే పడగా.. రెండో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక మూడో రోజైన ఆదివారం ఇంకా ఆట ఆరంభం కాలేదు. వర్షం పడుకున్నా.. గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్ ఇంకా మొదలవ్వలేదు. మూడో రోజు ఆట మొదలవ్వడానికి మరింత ఆలస్యమవనుంది. ఇప్పటికే…
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరగడంతో క్రికెట్ జట్టు ఆటగాళ్లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే మ్యాచ్‌కు వ్యతిరేకంగా వీహెచ్‌పీ బంగ్లాదేశ్ జెండాను దహనం చేసి రచ్చ చేశారు. ఈ క్రమంలో మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన బంగ్లా వీరాభిమాని టైగర్ రాబీపై కొందరు దాడి చేశారు. దీంతో..…
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే.. ఈ మ్యాచ్ ముగియాల్సిన సమయం కంటే ముందుగానే ముగిసిపోయింది. కారణమేంటంటే.. వర్షం ఆటంకం కలిగించింది. స్టేడియం వర్షం పడి కొంత చిత్తడిగా ఉంటడంతో ఆట ఒక గంట ఆలస్యంగా మొదలైంది. లంచ్ విరామం తర్వాత కొంతసేపు మ్యాచ్ జరిగింది. ఇంతలో మళ్లీ వర్షం పడింది. చాలా సేపటి వరకూ వర్షం తగ్గకపోవడంతో తొలి రోజును ఆటను అంపైర్లు ముగించారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 16 ఏళ్లుగా అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. భారతదేశంలోనే కాదు.. దాయాది పాకిస్తాన్‌లో కూడా మనోడికి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోసం ఫాన్స్ బారికేడ్లు దాటిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కోహ్లీ కాళ్లను తాకి తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీపై ఉన్న తన…
Rohit Sharma Selected Field after 9 Years in Tests in India: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారత గడ్డపై జరిగే మ్యాచుల్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్లు బౌలింగ్‌ను తీసుకోవడం చాలా అరుదు. కానీ రోహిత్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చివరిసారిగా 2015లో అప్పటి సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై…
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. పిచ్ ప్లాట్‌గా ఉందని, దాన్ని మా ముగ్గురు సీమర్లు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామన్నాడు. తొలి టెస్టులో సరైన ఆరంభం దక్కలేదని, ఈ టెస్ట్ కోసం బాగా సన్నద్ధం అయ్యామని రోహిత్ చెప్పుకొచ్చాడు. గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో ఉదయం 9 గంటలకు పడాల్సిన…
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాస్త ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం కారణంగా గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో.. ఉదయం 9 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమయింది. మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు.. టాస్ 10 గంటలకు ఉంటుందని, మ్యాచ్ 10.30కు ప్రారంభమవుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కావాల్సింది. కాన్పూర్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించొచ్చని వాతావరణ శాఖ ముందే చెప్పింది. వర్షం…
నేటి నుంచి ఆరంభమయ్యే చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొంటుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్వదేశంలో రికార్డు స్థాయిలో 18వ టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా.. కాన్పూర్‌లోనూ బంగ్లాను చిత్తు చేయాలని చూస్తోంది. మంచి ఫామ్ మీదున్న రోహిత్ సేనను ఆపడం బంగ్లాకు పెను సవాలే. తొలి టెస్టులో దెబ్బతిన్న బంగ్లాదేశ్ పుంజుకోవాలని భావిస్తోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ శతకంతో రాణించాడు. గిల్…