Gannavaram Airport: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో గల గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం వాతావరణంలో వ్యాపించిన దట్టమైన పొగ మంచు కారణంగా అరగంటకు పైనే గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
రామ్ చరణ్ హీరోగా ఇటీవల గేమ్ చేంజర్ అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. పెద్ది అనే ప్రచారం జరుగుతోంది కానీ టైటిల్ ఫిక్స్ చేసేదాకా అది నిజమా కాదా అనేది…
తెలంగాణ టెట్ పలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి విడుదల చేశారు. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం అర్హత సాధించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
బంగారం ధరలు గోల్డ్ ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆభరణాలు కొందామన్నా, ఇన్వెస్ట్ చేద్దామన్నా ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతకంతకు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది పసిడి. బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా అంటూ ఉసూరుమంటున్నారు. కాగా పుత్తడి ధరలు నేడు మరోసారి ఆకాశాన్ని తాకాయి. నిన్న తులం బంగారంపై ఏకంగా రూ. 1050 పెరగగా.. నేడు మళ్లీ రూ. 1040 పెరిగింది. తగ్గేదే లే అంటూ బంగారం ధరలు భగభగమంటున్నాయి. నేడు హైదరాబాద్ లో తులం…
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. బల్దియా పరిధిలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తిగా నిస్పాక్షికంగా జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సర్వేను ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో నిర్వహించిందని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. అయితే, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కావాలని సర్వేకు దూరంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో…
హమ్మయ్య బంగారం ధరలు తగ్గాయి అని అనుకునే లోపే మళ్లీ షాకిచ్చాయి. ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతున్నాయి. పసిడి ప్రియులకు ఊహించని షాకిస్తున్నాయి గోల్డ్ ధరలు. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. వంద, రెండు వందలు కాదు ఏకంగా తులం బంగారంపై రూ. 1050 పెరిగింది. ఒక్కరోజులోనే రూ. వెయ్యికి పైగా ధర పెరగడంతో గోల్డ్ లవర్స్ ఉసూరుమంటున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)…
Blackmailer: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు అదే టెక్నాలజీ ఉపయోగించి అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వల్ల అనేకమంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు వారి బాధను భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఓ బ్లాక్ మైలర్ బెదిరించి ఏకంగా…