Hyderabad: హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి టోలిచౌకీలో రెండు గుంపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గోల్కొండకు చెందిన షకీల్ కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం అందిందని డీఐ బాలకృష్ణ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, ప్రాథమిక విచారణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తప్ప గన్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జిపైన అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
రోజుకో ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఫేక్ కాల్స్, మెసేజెస్, లింక్స్ పంపించి ఖాతాలు లూటీ చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మరో మోసం వెలుగు చూసింది. హైదరాబాదులోని ఓ కంపెనీని నట్టేటముంచేశారు సైబర్ క్రిమినల్స్. ఈమెయిల్ తో బురిడీ కొట్టించి ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన ఓ కంపెనీ హాంకాంగ్ కంపెనీ నుంచి ముడిసరుకు కొనుగోలు చేస్తుంది. ముడిసరుకు అందిన తరువాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి అమరావతికి వెళ్లనున్నారు. ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైళ్ల క్లియరెన్స్‌లో మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అగ్రస్థానంలో ఉండగా.. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. మేం పవర్లోకి వచ్చాక సామాన్యులు సైతం నిరభ్యంతరంగా సచివాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటూ జబ్బలు చరుచుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ... రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి అదే సెక్రటేరియట్‌లోని పలు పేషీల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయట. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలోనే ఉద్యోగుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని సెక్రటేరియెట్ ఉద్యోగులే వాపోతున్న పరిస్థితి.
Rare Treatment : హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. బాల్యంలో ప్రమాదవశాత్తు పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియాకు చెందిన యువకుడికి (20) వైద్యులు అత్యాధునిక పద్ధతులతో కొత్త జీవితం ఇచ్చారు. ఈ సమగ్ర చికిత్స ద్వారా అతడి చేతిపై పురుషాంగాన్ని అభివృద్ధి చేసి, తర్వాత శస్త్రచికిత్స ద్వారా తన శరీరంలోని సహజ స్థితికి అనుసంధానం చేశారు. బాల్యంలో జరిగిన ప్రమాదం చికిత్స పొందిన యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ (సర్జికల్ సర్కంసిజన్)…
వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు శాంతించాయి. పసిడి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. గోల్డ్ లవర్స్ కు ఇది ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. శుభకార్యాలకు, వివాహాది కార్యక్రమాలకు పసిడి కొనాలనుకునే వారు మళ్లీ ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుత్తడి ధరలు ఓ రోజు పెరుగుతూ, ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ, మరో రోజు స్థిరంగా కొనసాగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్ మార్కెట్…
Minister Seethakka : తెలంగాణ రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పెరుగుతుండటం, అనేక మంది నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు, అనేక మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత…
GHMC : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సీరియస్ అయింది. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి అనుమతుల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలడంతో, సంబంధిత భవనానికి ఇచ్చిన అనుమతులను బల్దియా రద్దు చేసింది. అపార్ట్మెంట్ నిర్మాణంలో సెట్ బ్యాక్ లేకపోవడంతో పాటు, బారికేడింగ్, రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయకుండా సెల్లార్ తవ్వకాలు జరిపినట్టు విచారణలో స్పష్టమైంది. అంతేగాక, ఈ తవ్వకాలు GHMC అధికారుల అనుమతి లేకుండా జరిగినట్టు…