సోషల్ మీడియా.. కలుపుతుంది.. విడగొడుతుంది .. మంచి చేస్తుంది ..చెడు చేస్తుంది.. ఈ సోషల్ మీడియానే ఇప్పుడు చాలామందికి శత్రువులుగా మారిపోయింది ..ఈ సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లు కూడా లేకపోలేదు.. సోషల్ మీడియా కాపురాలను కూల్చివేస్తుంది. పచ్చని సంసారంలో కూడా సోషల్ మీడియా చిచ్చు పెడుతుంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక యాప్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే తరహాలో ఇద్దరు కలిసి హైదరాబాదులో కలుసుకున్నారు.
Also Read:Odisha: అనారోగ్యానికి గురైన నెల రోజుల శిశువు.. నయం కావడానికి ఒంటిపై 40 వాతలు..
పల్నాడు కు చెందిన అబ్బాయి హైదరాబాద్ చెందిన అమ్మాయికి యాప్ లో పరిచయం ఏర్పడింది.. పెళ్లయింది భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు పుట్టారు అబ్బాయికి పెళ్లి కాలేదు జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చే ప్లాన్లో ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిపోయింది. ఇద్దరు కలిసి జీవించాలి అనుకున్నారు.. అయితే భర్తను ఎలా వదిలించుకోవాలో తెలియదు.. దీంతో భర్త బయటికి వెళ్ళగానే ప్రియుడితో యాప్ లో చాటింగ్ చేసి నేరుగా హైదరాబాద్ కి రప్పించింది. భర్త లేని సమయంలో ప్రియుడుతో గడిపింది.. భర్త బయటికి వెళ్లిపోగానే ముల్లె మూట సర్దుకొని బైక్ పై బయలుదేరింది..
Also Read:Harassing On Horse: పెళ్లి ఊరేగింపులో గుర్రంపై దారుణం.. సిగరెట్ తాగించి ఆపై?
విషయాన్నీ గుర్తించిన భర్త వెంటపడ్డాడు.. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాడు.. చివరికి బైకును వదిలేసి బస్సులో ఎంచక్కా పారిపోయారు. పోతూ పోతూ సెల్ఫోన్లను పడేసి వెళ్ళిపోయారు ..ఇక ఎవరితో కాంటాక్ట్ లేకుండా పోయింది .. బైక్ ను తీసుకువెళ్లి భర్త పోలీస్ లకు అప్పగించి నా భార్య యువకుడ్ని పట్టుకొని వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు.. దీనిపై పోలీసుల విచారణ ప్రారంభం చేశారు.. అయితే ఇందులో అసలు విషయం మాత్రం పోలీసులు గుర్తించారు.. భర్తతో ఉన్న కొన్ని సమస్యలు దానికి తోడు కొన్ని ఇబ్బందులు వీటన్నిటిని వేరసి ప్రియుడుతో వెళ్లేందుకు సుకన్య సిద్ధపడిందని పోలీసులు తెలిపారు.
Also Read:SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటుకు కసరత్తులు..
ప్రియుడి పై మనసు పడింది. అతడే కావాలని అనుకుంది.. కట్టుకున్న భర్త, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. సుకన్య35.. గోపి 22 లు పారిపోయారు.. తన భార్య కనిపించడం లేదంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు భర్త కంప్లైంట్ ఇచ్చాడు.. సుకన్య భర్త జయరాజ్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదైంది.. సీసీ కెమెరాల ఆధారంగా సుకన్యను పట్టుకునేందుకు భర్త ప్రయత్నించారు. గోపీ అనే ఓ వ్యక్తి బైక్ ఎక్కి వెళ్లడాన్ని గమనించారు. వీరిద్దరని చివరకు మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద ఇద్దరిని పట్టుకున్నారు. అయితే బైక్ ను అక్కడ వదిలేసిన గోపి, సుకన్య రన్నింగ్ బస్సు ఎక్కి తప్పించుకుని పారిపోయారు.
Also Read:Gopireddy Srinivasa Reddy: పోసానిపై 14 కేసులా..? మీరు 3 కేసులు పెడితే రేపు 30 పెట్టే సమయం ఉంది..!
ఇద్దరినీ పట్టుకునేందుకు పోలీసులు, భర్త ప్రయత్నం చేయగా చిక్కలేదు.. ఇద్దరి వద్ద కూడా సెల్ఫోన్లు లేకపోవడంతో వాళ్ళని పట్టుకోవడం కష్టతరంగా మారిపోయింది.. సోషల్ మీడియా సుకన్యకు ప్రాణం.. ఈ సోషల్ మీడియా లో గోపీతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది.. సుకన్యపై గోపీ చూపించే ప్రేమ నచ్చడంతో ఇద్దరు బాగా దగ్గర అయినారు. దీంతో ఇద్దరు కలిసి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు కు చెందిన గోపిని సుకన్య హైదరాబాదుకు రప్పించింది.. హైదరాబాదులో కొన్నాళ్లపాటు ఇద్దరి కలిసి జీవించారు..
Also Read:Rishabh Pant: మరో అంతర్జాతీయ అవార్డు రేసులో రిషబ్ పంత్
భర్తకు తెలియకుండా చాలా కాలం పాటు ఉన్నారు.. జీవనోపాధి కోసం గోపి హైదరాబాద్ కు వచ్చాడు.. ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకోవడంతో భర్త పిల్లలని వదిలేసి వెళ్దామని గోపికి చెప్పింది.. గోపి కూడా ఒప్పుకోవడం జరిగింది. దీంతో గత నెల ఇద్దరు కలిసి పారిపోతుండగా భర్త పట్టుకునే ప్రయత్నం చేశాడు.. చివరకు చిక్కకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెల రోజుల నుంచి కూడా సుకన్య గోపీల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు అయినప్పటికీ వారిద్దరి జాడ మాత్రం దొరకలేదు. అతడికి 22 ఆమెకు 35 ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది.