గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ..
పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టిన ఆయన.. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఈ పర్యటనలో మొదట దర్శించుకోనున్నారు పవన్ కల్యాణ్..
ఇవాళ్టి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్న పవన్. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగు నామినేషన్లలో రెండు కాంగ్రెస్, రెండు బిఆర్ఎస్ నుంచి దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన హిమాయత్ నగర కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప. Also Read:…
గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నానాక్ రామ్ గూడ వద్ద 41 గ్రాముల బ్రౌన్ హెరాయిన్‌ను శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. బంగ్లాదేశ్ నుండి హైదరాబాద్ నగరంకు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ టీమ్ గుర్తించింది. Also Read: Tiger Roaming: కాటారంలో పెద్దపులి సంచారం కలకలం.. భయాందోళనలలో ప్రజలు!…
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ దివాన్‌దేవిడిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. రూ.60-100 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దాదాపు 400 బట్టల దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజు తర్వాత ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగింది. దాదాపు 20 ఫైర్ ఇంజన్లతో 24 గంటల పాటు మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. Also Read: Jasprit Bumrah:…
సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. జింఖానా గ్రౌండ్స్ వద్ద 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ STF అధికారులు సీజ్ చేశారు. పది కిలోల గంజాయిని పట్టుకున్నారు. అరకు నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి 20 మందితో కలిసి వచ్చి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి విచక్షణ హంగామా చేశాడు వీర రాఘవరెడ్డి. దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Car Racing: హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొంతమంది యువకులు కార్లతో రేసింగ్‌లు, స్టంట్లు చేయడం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యువకులు ఓఆర్ఆర్పై వేగంగా కార్లు నడిపించి, ఆపై ఒక్కసారిగా వాటిని ఆపి గింగిరాలు తిప్పారు. ఇలా ఉన్నచోటే కార్లను పలుమార్లు రౌండ్‌గా తిప్పుతూ హంగామా సృష్టించారు. ఈ కార్ రేసింగ్ కారణంగా ఓఆర్ఆర్పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులకు…
Hyderabad: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ హత్య ఘటన నగరాన్ని తీవ్ర కుదిపేసింది. కుటుంబ ఆస్తుల కోసం జరిగిన ఈ హత్యలో చంద్రశేఖర్ సొంత మనవడు కీర్తి తేజ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 73 సార్లు కత్తితో పొడిచి తన తాతను హతమార్చిన కీర్తి తేజ, తండ్రి లేని కుటుంబంలో తాత ఇతర మనవళ్లను చూసినట్లుగా తనను చూడలేదని భావించి ఈ హత్యకు పాల్పిడినట్లు తెలుస్తోంది. వెలమాటి చంద్రశేఖర్ తన కంపెనీలో ఇటీవల ఒక…