హయత్‌నగర్‌లో మగవాళ్లను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్ పేరుతో దగ్గర కావడం, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రహస్యంగా రికార్డ్ చేయడం, తరువాత ఆ వీడియోలను చూపించి డబ్బులు దోచుకోవడం.. ఇలాంటి నేర పద్ధతితో ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ప్రాంతానికి చెందిన ఈ మహిళ రెండవ వివాహం ఒక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో జరిగినట్లు…
భట్టి మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ గురించి దేశం చర్చిస్తుంది.. దాని ఆవిష్కరణకి తెలంగాణను ఎంచుకున్నందుకు నీతి ఆయోగ్ కి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. డిజిటల్, టాలెంట్ కి హైదరాబాద్ కి కేంద్రంగా మారింది అన్నారు.
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ వేగవంతం అయింది. ఇప్పటికే ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
HMDA Land Auction: కోకాపేట నియో పోలీస్ భూములకు మూడో విడత వేలం ముగిసింది. ఈరోజు (డిసెంబర్ 3న) ప్లాట్ నంబర్స్ 19, 20లోని 8.04 ఎకరాలకు ఈ వేలం వేశారు అధికారులు.
IndiGo Flights Delay: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొన్ని విమానాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీని కారణంగా పలు ఫ్లైట్లు ఆలస్యం అవ్వగా, కొన్ని విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది.
Loan Fraud: హౌసింగ్ లోన్ మోసం కేసులో ఓ దంపతులకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి కోర్టు. నకిలీ పత్రాలతో లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన దంపతులు దసరథ్ నేత, లక్ష్మీబాయిగా గుర్తించారు.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న పిల్లలపై కుక్క కాట్ల ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు హయత్‌నగర్‌లో ప్రేమ్‌చంద్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
CM Revanth Reddy : హైదరాబాద్ లోని హయత్ నగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూగ బాలుడు ప్రేమ్ చంద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఉదయం పత్రికల్లో ఈ వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే, బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,…
HYDRA : పాతబస్తీకి తలమానికంగా నిలిచే చారిత్రక బమృక్నుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతూ ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో ఈ చెరువును ప్రజలకు అర్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో ఆక్రమణలతో నాశనం అయిన ఈ చెరువు, హైడ్రా చేపట్టిన సమగ్ర అభివృద్ధి చర్యలతో మళ్లీ తన పాత ఔన్నత్యాన్ని తిరిగి పొందుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం చెరువు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు…