Janasena Foundation Day Celebrations: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది.. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా.. పార్టీ ఆవిర్భావ వేడుకులకు వెళ్లాలనే నేతలు సిద్ధం అవుతున్నారు.. అందులో భాగంగా జిల్లాల నాయకులు, నియోజకవర్గం నేతలు, పార్టీ కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేమురి శంకర్ గౌడ్ కోరారు. ఈ రోజు కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని వైష్ణవి గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. 14వ తేదీన జనసేన నేతలు భారీ ఎత్తున తరలివచ్చి.. ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పార్టీ ఆవిర్భావ సభ ఇది.. ఈ సభ వేదికగా పార్టీకి సంబంధించిన పలు అంశాలను అధినేత పవన్ వెల్లడిస్తారని ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ సూచనలు చేయనున్నారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు సైతం సిద్ధంగా ఉండాలని సూచించారు.
Read Also: MLC Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు