Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్ వడ్డింపు..
- యుద్ధ ప్రభావంతో విమాన టికెట్ ధరలకు రెక్కలు..
- వన్ వేకే టూ వే ధర..
- లక్షన్నర దాటిన అమెరికా ఫ్లైట్ టికెట్ రేట్..
- మిడిలీస్ట్‌కు సర్వీసులు నిలిపివేసిన పలు విమానయాన సంస్థలు..
- గమ్యస్థానాలకు వెళ్ళకుండానే మధ్యలోనే కొన్ని ఫ్లైట్స్ రిటర్న్..
- విజువల్స్....యుద్ధం, విమానాలు, ఎయిర్‌పోర్టులు..
- మిడిలీస్ట్‌కు సర్వీసులు నిలిపివేసిన విమానయాన సంస్థలు..
- భారీగా పెరిగిన ఫ్లైట్ టికెట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flight Ticket Price Hike: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాల పై ఎఫెక్ట్ పడింది. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ మీదుగానే రూట్ అవుతాయి. ఇక ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. యుధ్ధం కారణంగా విమాన ప్రయాణాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా.. కొన్ని సంస్థలు విమానాలను లిమిటెడ్ గా నడపడంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చితే మూడు రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.
ఇండియా నుంచి అమెరికా.. యూరప్ దేశాలకు కొన్ని విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా ఎయిర్ ఇండియావే. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అనుమతి వుంటేనే నడుపుతున్నాయి. ఇండియా నుంచి అమెరికా.. యూరప్ వెళ్ళాలంటే టికెట్ ధర వన్ వే కే.. టూ వే టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయి సంస్థలు. ఎయిర్ ఇండియా.. ఎతిహాద్.. ఎమిరేట్స్ విమానాల రేట్లకు రెక్కలొచ్చాయి. అమెరికా వెళ్ళాలంటే తొంభై వేల ధర ఉంటే ప్రస్తుతం లక్షన్నర ఉంది. టికెట్ ధరలు ఫ్లైట్ బుకింగ్ టైం లో ఒకలా.. పేమెంట్ టైం లో ఒకలా చూపిస్తున్నాయి. అంటే నిమిషం నిమిషానికి చార్జ్ మారుతోంది. గల్ఫ్ దేశాలకు కొన్ని విమానాలు నడుస్తున్నా అవి టేకాఫ్ అవుతాయా లేదా అన్నది మరో డైలమా. ఇంకొన్ని విమానాలు గమ్యస్థానాలకు వెళ్ళే దారి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు అధికంగా ప్రయాణికులు ఉంటారు. ఒకవేళ విమానాలు షెడ్యూల్ చేసినా ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో అర్థంకాక ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా..యుద్ధం విమానయాన రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సంస్థలు రిస్క్ ఎందుకులే అని తమ సర్వీసులను ఆపేయగా.. కొన్ని సంస్థలు భారీగా టికెట్ రేట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. మొత్తంగా యుద్ధ ప్రభావంతో విమాన ప్రయాణాలు భారంగా మారాయి. టికెట్ దొరకడం ఒకెత్తయితే.. రేట్లు మరో ఎత్తు. టికెట్ దొరికినా అది డెస్టినేషన్‌కు పోతుందో….యుద్ధం భయంతో మధ్యలోనే రిటర్న్ అవుతుందో తెలీక ప్రయాణికులకు డైలమా తప్పడం లేదు.
ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు భారత విమానయాన రంగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, Air India తన టిక్కెట్లపై ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచింది. ఈ పెంపు దేశీయ మరియు అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ₹400 నుండి ₹3,000 వరకు అదనపు ఖర్చును కలిగిస్తుంది.
ప్రధాన కారణాలు
– పశ్చిమాసియాలో యుద్ధం మూడవ జెట్ ఇంధన సరఫరాకు దెబ్బతీస్తుంది.
– భారతదేశం దేశీయ చమురు మరియు గ్యాస్ అవసరంలో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేస్తుంది.
– LPG ధరలు సిలిండర్‌కు ₹60 (గృహ) మరియు ₹115 (వాణిజ్య) పెరిగాయి.
– విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ATF (Aviation Turbine Fuel) 40% వాటా కలిగి ఉండడం వల్ల, ఇంధన ధరలు పెరగడం టికెట్ ఖర్చులను నేరుగా ప్రభావితం చేస్తాయి.
ఎయిర్ ఇండియా సర్‌ఛార్జ్ వివరాలు
– దేశీయ మార్గాల టిక్కెట్లు: సుమారు ₹399 వరకు అధికం.
– పశ్చిమాసియా విమానాలు: $10 పెరుగుదల.
– ఆగ్నేయాసియా విమానాలు: $20 పెరుగుదల.
– ఆఫ్రికా విమానాలు: $30 పెరుగుదల.
భవిష్యత్తు ప్రభావం
– ATF ధరలు పెరుగుతూ ఉంటే, విమాన టికెట్ ధరలు ఇంకా ఎక్కువవుతాయి.
– ప్రధాన నగరాల్లో (ఢిల్లీ, ముంబై) ATFపై అధిక ఎక్సైజ్ సుంకం మరియు VAT కారణంగా, విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు మరింత పెరుగుతాయి.
– ఎయిర్ ఇండియా ప్రకారం, కొత్త ఇంధన సర్‌ఛార్జ్ వ్యవస్థను మూడు దశల్లో అమలు చేస్తారు మరియు అన్ని విమానాలకు వర్తిస్తాయి.
– పరిస్థితులు అదే విధంగా కొనసాగితే, భవిష్యత్తులో భారతీయ విమాన ప్రయాణం మరింత ఖరీదైనదిగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!