డబ్బు అంటే ఎవరికి చేదు.. డబ్బుంటే ఎవరికైనా ఇష్టమే. డబ్బున్న వాడు మరింత సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. డబ్బు లేని వాడు పైస్థాయికి పోవాలని ఆలోచన చేస్తాడు. .దేనికైనా డబ్బే ముఖ్యం. అలాంటి డబ్బు బంధాలు బంధుత్వాలను తెంపివేస్తుంది.. చివరికి దూరం చేస్తుంది. ఆస్తి కోసం కన్న వాళ్ళని సైతం కడ తేర్చేందుకు వారసులు వెనకడు వెయ్యడం లేదు. ఆస్తి కోసం మరొక హత్య హైదరాబాదులో జరిగింది. కొన్ని రోజుల క్రితమే వందల కోట్ల రూపాయల ఆస్తి పర్యటన చంద్రశేఖర్ని మనవడే అతి కిరాతకంగా చంపిన సంఘటన మర్చిపోకముందే మరొక సంఘటన వెలుగు చూసింది. ఆస్తి కోసం మరొక బంధం తెగిపోయింది.. ఆస్తి పంచి ఇవ్వలేదని చెప్పి కన్న తల్లిని కిరాతకంగా చంపాడు కన్నా కొడుకు. విచక్షణ మరచిపోయి ఏకంగా 15 పోట్లు పొడిచి దారుణంగా తల్లిని చంపి పారిపోయాడు. ఒకవైపు జులాయిగా తిరుగుతూ, మద్యం తాగుతూ, డ్రగ్స్ కు అలవాటు పడ్డ కొడుకుని సన్మార్గంలో తెచ్చేందుకు.. తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే కొడుకు ఆస్తి కోసం తగాద పెట్టుకున్నాడు. తనకు ఆస్తి రాసిస్తే తాను చూసుకుంటానని ఆస్తి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నామని చెప్పి తల్లిదండ్రులతో కొడుకు నిత్యం గొడవపడ్డాడు. చివరికి ఆస్తి రాసి ఇవ్వలేమని చెప్పడంతో ఇంట్లో పడుకున్న తల్లి పైన కిరాతకంగా 15 పోట్లు పొడిచి చంపేశాడు. తెల్లాపూర్ లోని గ్రేటెడ్ కమ్యూనిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Harassing On Horse: పెళ్లి ఊరేగింపులో గుర్రంపై దారుణం.. సిగరెట్ తాగించి ఆపై?
నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకే ఆ తల్లికి శాపంగా మారాడు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటే వీడే అని చెప్పవచ్చు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే చివరికి కిరాతకంగా చంపేశాడు. ఏ తల్లి అయినా ఇలాంటి కొడుకునా కని పెంచింది అనుకునేలా చేశాడు. విచక్షణ మరిచి తల్లిని పొట్టనపెట్టుకున్నాడు. మద్యానికి బానిసై తరచూ గొడవ పడుతూ కుటుంబానికి భారం అయ్యాడు. ఆయనప్పటికీ కూడా తల్లిదండ్రులు కొడుకును భరిస్తూ వచ్చారు. పోషణ ఇబ్బంది అయినప్పటికీ కూడా కొడుకుని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. కానీ ఆ కొడుకు ఆస్తికోసం అన్ని మర్చిపోయాడు. తల్లిని కిరాతకంగా పొడిచి చంపడం కలకలం రేపింది.
Gopireddy Srinivasa Reddy: పోసానిపై 14 కేసులా..? మీరు 3 కేసులు పెడితే రేపు 30 పెట్టే సమయం ఉంది..!
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని తెల్లాపూర్ మున్సిపల్ పరిధి డివినో విల్లాస్ ఉంది. అతిపెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ అయిన ఈ విలాస్ లో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాధిక దంపతులకు కార్తీక్ రెడ్డి ఉన్నాడు. ఇతను జులాయిగా తిరుగుతూ మద్యంకు బానిస అయ్యాడు. దానితోపాటు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటాడు. కొడుకుని కంట్రోల్ లో పెట్టేందుకు తల్లిదండ్రులు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఎప్పుడు అడిగినా డబ్బులు ఇచ్చే తల్లిదండ్రులు ఇటీవల కాలంలో కట్టడి చేశారు. తనకు డబ్బులు కావాలని చెప్పి ఇటీవల కాలంలో కార్తీక్ రెడ్డి ఇంట్లో గొడవలు పడడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో గొడవలు పెద్దగా అయ్యాయి. తన వాటాగా వస్తున్న ఆస్తి మొత్తం రాసి ఇవ్వాలని తల్లిదండ్రుల పైన ఒత్తిడి తెచ్చాడు. వాటా ఆస్తి ఇచ్చే ప్రసక్తి లేదని తల్లిదండ్రులు తెగేసీ చెప్పారు. దీంతో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్నాడు.. ముఖ్యంగా ఆస్తిలో వాటా రాసి ఇవ్వకుండా తల్లి అడ్డం పడుతుందని కొడుకు కార్తీక్ రెడ్డి భావించాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో పడుకొని ఉన్న తల్లిపై అతి కిరాతకంగా దాడికి తెగబడ్డాడు.. దాదాపు 15 సార్లు కత్తితో పొడిచారు. తీవ్ర రక్తస్రావం అయిపోయిన తల్లి రాధిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.దీంతో ఇంట్లో వాళ్ళు ఇది చూసి వెంటనే రాధిక పక్కనే ఉన్న ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాధిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిని పొడిచి చంపి పారిపోయిన కార్తీక్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.