అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 భారత్ గెలుచుకున్నవిషయం తెలిసిందే. భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన భీకర పోరులో భారత జట్టు విజయ దుందుభి మోగించింది. బ్యాటిగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం గొంగిడి త్రిష అసాధారణ ప్రతిభ కనబర్చింది. 32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను…
SC Classification: ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీకి, ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ మధ్య కీలక భేటీ కొనసాగింది.
గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో కాల్పులు ఘటనపై కీలక విషయాలు వెల్లడయ్యాయి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నటోరియాస్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌పై ఇప్పటికే 80 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో16 కేసులో మోస్ట్ వాంటెడ్ గా ప్రభాకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్ బాగ్ కార్పోరేటర్, కాలాపత్తర్ ఇన్స్పెక్టర్, బహదూర్ పురా పోలీసులు వెంటనే స్పందించారు. కిషన్‌బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ బిల్డింగు సెల్లార్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అది కాస్త పైపునకు పాకింది. అగ్ని ప్రమాదం వల్ల భవనంపై అంతస్తు్ల్లోనూ దట్టమైన పొగ అలుముకుంది.
Budget 2025: కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై హైదరాబాద్ నగరం భారీగా ఆశలు పెట్టుకుంది. మౌలిక వసతులు, ఇతర రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని, నిధుల కేటాయింపులు ఉంటాయని మహా నగర ప్రజలు వేచి చూస్తున్నారు.
జరుగుతున్న ప్రచారమే నిజమైంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ చిత్రం హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాని బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేస్తోంది సినిమా యూనిట్.…
Damodara Raja Narasimha: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ, రానున్న రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 విభాగాలు పనిచేస్తాయని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. రూ. 2700 కోట్ల వ్యయంతో, అత్యాధునిక…
Sri Lakshmi Constructions Fraud: మేడ్చల్ జిల్లా దిండిగల్ పరిధిలో మల్లంపేటలోని శ్రీలక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎండీ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి.. తమను మోసం చేసి తప్పించుకుని తిరుగుతోందంటూ విజయలక్ష్మీపై పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాకు పారిపోతుండగా పట్టుకుని దుండిగల్ పీఎస్ కు తీసుకెళ్లారు.
BRS Corporators Protest: జీహెచ్ఎంసీ ఆఫీసులో మరోసారి ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న కౌన్సిల్ మీటింగ్ లో జరిగిన దాడిపై కమిషనర్ ఇలంబరితిని కలిసి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు. అయితే, సీఎం ప్రోగ్రాం కారణంగా అందుబాటులో కమిషనర్ లేకపోవడంతో.. అడిషనల్ కమిషనర్ శివ ప్రసాద్ నాయుడుకి ఫిర్యాదు పత్రం అందించారు.