ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్‌కౌంటర్‌లో ముందుగా నలుగురు చనిపోగా.. ఆ తరువాత మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఈ రోజు ఉదయం వరకు మొత్తంగా 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు బీజాపూర్‌లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతంలో మావోయిస్టులకి, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ…
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. నారాయణ్‌పూర్- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన నేరస్థుడు సోను మట్కాను హతమార్చింది ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం. సోనూ మట్కా హషీం బాబా ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. అతనిపై రూ.50,000 రివార్డు కూడా ఉంది. అయితే.. దీపావళి రోజు రాత్రి షహదారాలో మామ, మేనల్లుడి జంట హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కోసం.. ఢిల్లీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పచ్చని అడవి రక్తసిక్తమైంది. తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు హతమైనట్లుగా తెలుస్తోంది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలకు ఘన విజయం లభించింది. గందర్‌బాల్‌లో ఓ ప్రైవేట్ కంపెనీ హౌసింగ్ క్యాంపులో ఆరుగురు కార్మికులను, వైద్యుడిని చంపేసిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదిని పాకిస్తాన్‌కి చెందిన లష్కరేతోయిబాకి చెందిన జునైద్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. ఈ ఉగ్రవాది గగాంగీర్, ఇతర ప్రదేశాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా పాల్గొన్నాడు.
ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో 10 మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది అంతమొందించాయి. 10 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఎన్‌కౌంటర్‌ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలిసెలా ధృవీకరించారు. కోర్ ఏరియా కావడంతో సైనికులు సంప్రదించలేకపోతున్నారు. కంకేర్ నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.