ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పచ్చని అడవి రక్తసిక్తమైంది. తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు హతమైనట్లుగా తెలుస్తోంది. నారాయణపూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భద్రతా సిబ్బంది, మావోల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ అబుజ్‌మాద్‌లోని ఒక అడవిలో తెల్లవారుజామున 3 గంటలకు భద్రతా సిబ్బంది యాంటీ నక్సలైట్ ఆపరేషన్‌లో ఉన్నప్పుడు ఈ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు హతమైనట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు.
ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా తెలస్తోంది. నారాయణపూర్, దంతేవాడ, జగదల్‌పూర్, కొండగావ్ జిల్లాల సంయుక్త కార్యాచరణ కొనసాగుతోంది. ఉదయం నుంచి డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు కాల్పుల్లో పాల్గొన్నారు.