Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. నారాయణ్‌పూర్- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందాగా.. మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో శనివారం నాడు అర్ధరాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపగా.. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందారు.
Read Also: Virat Kohli: నా దగ్గర ఏమీ లేదు చూస్కోండి.. ఆసీస్ అభిమానులకు విరాట్ కోహ్లీ కౌంటర్
ఇక, మావోయిస్టుల కాల్పుల్లో దంతెవాడ డీఆర్‌జీ హెడ్ కానిస్టేబుల్ కరమ్ ప్రాణాలు కోల్పోగా.. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఎస్ఎల్ఆర్ లాంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, ఇంకా భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.