ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారీ కాంకేర్, మారేడుబాక ప్రాంత అడవుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నెలలో ఇది రెండో ఎన్‌కౌంటర్. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), ఐదు బెటాలియన్ల సీఆర్పీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ 229వ బెటాలియన్ బలగాలు నక్సల్స్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఇదే జిల్లాలో ఈ నెల 12న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోలతో పాటు ఐదుగురు మావోయిస్టులు మరణించారు.
అంతకుముందు రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. నక్సల్స్ ప్రతిచోటా ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను (ఐఈడీ) అమర్చారని, బీజాపూర్ నక్సల్స్ దాడి పిరికిపంద చర్య అని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అన్నారు.
ఇది కూడా చదవండి: Aishwarya Rajesh: నలుగురు పిల్లల తల్లైనా ‘భాగ్యం’ బంగారమబ్బా!
ఇటీవల చాలా మంది ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు లొంగిపోయారు. అలా లొంగిపోయిన వారికి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది. గతేడాది భారీగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో అనేక మంది మావోయిస్టులు హతం అయ్యారు. ఇక కొత్త సంవత్సరంలో తాజాగా జరిగింది భారీ ఎన్‌కౌంటర్‌గా చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: Delhi Elections: కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆస్తులు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Chhattisgarh | 12 naxals killed in an ongoing encounter in the south Bastar area: Police official
— ANI (@ANI) January 16, 2025