Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఈరోజు (డిసెంబర్ 23) తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ ప్రాయోజిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ టెర్రరిస్టులపై యూపీ- పంజాబ్ పోలీసుల సంయుక్తంగా కలిసి ఆపరేషన్ నిర్వహించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపుర్ ఏరియాలో సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి.
Read Also: Dead Body in Parcel: చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు!
ఈ కాల్పుల్లో చనిపోయిన వారు గుర్‌విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్‌ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా పోలీసులు గుర్తించారు. వీరంతా గురుదాస్‌పూర్‌లో నివసిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, నిందితుల నుంచి ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టల్స్, భారీ మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
https://twitter.com/PTI_News/status/1871040127948251494