Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడలో మంగళవారం భద్రతా బలగాలకు, నక్సల్స్‌కి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కనీసం 09 మంది నక్సలైట్లు మరణించారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో నక్సలైట్ల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌లో భద్రతా బలగాలు-నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నోయిడాలో పోలీసులు కాల్పులు చేపట్టారు. అనంతరం నోయిడా పోలీసులు నలుగురు దుండగులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదుతోపాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. దుండగులపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు దుండగులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55).. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన.. 1993లో ఇంగ్లాండ్ తరుఫున అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో గ్రాహం థోర్ప్ 16 సెంచరీలు సాధించాడు. అలాగే 6744 పరుగులు చేశాడు..
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మూడేళ్లలో 80 మంది మావోయిస్టుల హతమయ్యారు. 2021 నుంచి ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. 102 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు.
శుక్రవారం నుంచి 3 రోజుల పాటు శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు. కూరగాయలతో అలంకారంలో కనకదుర్గమ్మ కనిపించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయం మొత్తాన్ని కూరగాయలతో అలంకరించనున్నారు. వారాంతపు సెలవులు ఉండే సమయం కావడంతో భక్తుల రద్దీకై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నేడు ఆషాఢ మాసం…
Encounter: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 6 గంటల పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు హతమయ్యారు.