ఎలక్టోరల్ బాండ్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కఠినంగా వ్యవహరించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకు పూర్తి నంబర్లు ఇవ్వలేదు.. ఎలక్టోరల్ బాండ్ కేసులో ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Electoral Bonds : ఇటీవల కాలంలో ఎలక్టోరల్ బాండ్ల విషయం ఎంతటి సంచలనంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. గత ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అత్యధిక డబ్బును విరాళంగా అందించిన ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఒక్క డీఎంకే పార్టీకి రూ.509 కోట్లు విరాళంగా అందించింది.
తాజాగా భారతదేశ ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ బాండ్ల సంబంధించి.. పార్టీల వారీగా రిడీమ్ చేసిన మొత్తంతో పాటు బ్యాంకు ఖాతాల సమాచారం లాంటి పూర్తి వివరాలను విడుదల చేసింది. ఈ సమాచారం ఎలక్షన్ కమిషన్ కి ఇదివరకే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి డిజిటల్ రూపంలో అందింది. ఎలక్ట్రో ఎలక్టోరల్ బాండ్ డేటాను రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లో ఏప్రిల్ 12, 2019 న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దాఖలు చేశాయి. అయితే ఇలా చేసిన సీల్డ్…
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది.
Lok Sabha Elections 2024: ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నట్లు ఈసీ వెల్లడించింది. దాదాపుగా 82 రోజుల సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది.
దేశంలో ఎన్నికల నగారా మోగింది. . దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది.
జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిపారు.
Election Commission: కేంద్రం ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో రెడ్ లైన్ దాటొద్దని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటనకు కొన్ని రోజుల ముందు ఎన్నికల సంఘం నుంచి వైదొలగాలని మాజీ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు.
భారతదేశ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమంగా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతోంది. పోలింగ్‌లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.