Elections 2024: అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది. శనివారం విడుదల చేసిన షెడ్యూల్‌లో తొలుత జూన్ 4న కౌంటింగ్ ఉండగా.. ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కౌంటింగ్ తేదీని మారుస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 19న అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.
Read Also: Praja Galam: చిలకలూరిపేటలో ప్రజాగళం సభ.. మోడీ ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి
సార్వత్రిక ఎన్నికలు,అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఓట్ల లెక్కింపు తేదీలను భారత ఎన్నికల సంఘం సవరించడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పుడు ముందుగా ప్రకటించినట్లుగా జూన్ 4న కాకుండా జూన్ 2న జరుగుతుంది. జూన్ 2న అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుండగా.. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న యథాతథంగా జరగనుంది.