కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటనను రిలీజ్ చేసింది. లోక్‌సభ ఎన్నికలు 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది.
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Voting Rule: తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ఓటర్లను పోలింగ్ స్టేషన్‌కి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇదే తరుణంలో పోలింగ్ బూత్‌లో ప్రిసైడింగ్ అధికారి ముందు తన గుర్తింపును నమోదు చేసుకున్న తర్వాత కూడా ఓటేయడానికి నిరాకరించిన ఓటర్లను అధికారులు బలవంతం చేయలేరని ఓటింగ్ రూల్స్ తెలియజేస్తున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అనుమతి లేకుండా ఇంటింటికి ప్రచారం చేపడితే కేసులు తప్పవని తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ అంశం సంబంధించి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు పెట్టడంతో రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ కు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. Also read: Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి.. తాజాగా…
Election Commission: ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రూ.లక్ష దాటిన లావాదేవీలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు ఈసీ లేఖ రాసింది.
రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తోంది. కాసేపట్లో ఎన్నికల సంఘం ముందు మూడు జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశించారు.
Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు బిజెపి ప్రభుత్వంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు నమోదైంది.