జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది అని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Lok Sabha Election 2024 : దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఎన్నికల సంఘం కూడా శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. అప్పుడు వచ్చే ఐదేళ్లపాటు అధికార పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండాలో దేశ ప్రజల ఓటు నిర్ణయిస్తుంది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను కలిపి నిర్వహిస్తే 8 వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుందని ఎన్నికల కమిషన్ పోల్ ప్యానెల్ ఉన్నతస్థాయి కమిటీకి స్పష్టంగా చెప్పింది.
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ ఇవాళ (శనివారం) వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ తో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేస్తామని తెలిపింది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాలు.. ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి స్థాయి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
ఎలక్టోరల్ బాండ్లపై దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని జాబితాలను బహిరంగపరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత, ఎన్నికల విరాళాలు ఇచ్చే కంపెనీల జాబితా, స్వీకరించే పార్టీల విరాళాల జాబితాను ఎన్నికల సంఘం బహిరంగపరిచింది.
Electoral bonds: సుప్రీంకోర్టు నుండి మందలింపు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI నుండి స్వీకరించిన ఎలక్టోరల్ బాండ్ డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిరంగ పరిచింది. డేటా పబ్లిక్‌గా మారిన తర్వాత ఆ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడంలో వెనుకాడుతున్నాయి.
Lok Sanha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. లోక్‌సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుంది.
ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం రెడీగా ఉంది. ఎన్నికల కమినషన్ కు నిన్న ( బుధవారం ) ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించారు.